Share News

Cucumber: దోసకాయలు చేదుగా ఉన్నవి ఎంచుకోకూడదంటే ఏం చేయాలి? ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

ABN , Publish Date - May 22 , 2024 | 04:37 PM

దోసకాయ అందరికీ ఇష్టమైన కూరగాయ. పేరుకు కూరగాయ కానీ దీన్ని వండకుండా నేరుగా తినడం చాలా మందికి ఇష్టం. అయితే కొన్నిసార్లు దోసకాయలు చేదు రుచి కూడా కలిగి ఉంటాయి. అందరికీ ఎప్పుడో ఒకసారి దోసకాయ చేదు అనుభవం లోకి వచ్చే ఉంటుంది కూడా. కానీ దోసకాయ కొనేటప్పుడే అది చేదుగా ఉందా లేదా అనే విషయాన్ని కనిపెట్టేయచ్చు.

Cucumber: దోసకాయలు చేదుగా ఉన్నవి ఎంచుకోకూడదంటే ఏం చేయాలి? ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

దోసకాయ అందరికీ ఇష్టమైన కూరగాయ. పేరుకు కూరగాయ కానీ దీన్ని వండకుండా నేరుగా తినడం చాలా మందికి ఇష్టం. అయితే కొన్నిసార్లు దోసకాయలు చేదు రుచి కూడా కలిగి ఉంటాయి. అందరికీ ఎప్పుడో ఒకసారి దోసకాయ చేదు అనుభవం లోకి వచ్చే ఉంటుంది కూడా. కానీ దోసకాయ కొనేటప్పుడే అది చేదుగా ఉందా లేదా అనే విషయాన్ని కనిపెట్టేయచ్చు. ఈ ట్రిక్ తో ఎప్పుడూ చేదు లేని దోసకాయలనే మార్కెట్ నుండి తెచ్చుకోవచ్చు. ఇంతకీ దోసకాయ చేదును కనిపెట్టే ట్రిక్ ఏంటో తెలుసుకుంటే..

దోసకాయ కొనేటపుడు దాని పై తొక్కను చూసి అది చేదుగా ఉందా లేదా తెలుసుకోవచ్చు. దేశీ దోసకాయలు అయితే చేదుగా ఉండటం తక్కువ. అందుకే ఎప్పుడు కూడా దేశీ దోసకాయలు కొనుగోలు చేయడం మంచిది. దోసకాయ పై తొక్క రంగు వృత్తాకారంగా.. మధ్య నుండి పసుపు రంగులో ఉన్నా, దోసకాయ పై తొక్క మీద చిన్నగా బుడిపెలు ఉన్నా అవి స్థానిక దోసకాయలు. ఇలాంటి దోసకాయలు చేదుగా ఉండవు.

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!


చేదు దోసకాయను గుర్తించడానికి మరొక మార్గం దాని ఆకారాన్ని చూడటం. దోసకాయలు చాలా పెద్దగా ఉన్నవి లేదా చాలా చిన్నగా ఉన్నవి కొనడం మానుకోవాలి. ఇలా పెద్దగా లేదా చిన్నగా ఉన్న దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే మధ్యస్థ పరిమాణంలో ఉన్నవి కొనాలి.

దోసకాయను కొనుగోలు చేస్తున్నప్పుడు కాస్త సున్నితంగా నొక్కాలి. దోసకాయ మెత్తగా ఉంటే అది కుళ్ళిపోయి, లోపల బాగా పండిపోయినట్టు. ఇవి చేదుగా ఉండే అవకాశం కూడా ఎక్కువ. అంతేకాదు ముక్కలు చేయబడిన లేదా మెలితిప్పినట్లు వంకరగా ఉన్న దోసకాయలు కూడా చేదుగా ఉండే అవకాశం ఉంది. తెల్లటి చారలు ఉన్న దోసకాయలు చేదుగా ఉంటాయి.

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 22 , 2024 | 04:37 PM