Cooling Foods: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
ABN , Publish Date - Apr 10 , 2024 | 05:32 PM
శరీరం వేడికి గురైతే శరీరంలో కలిగే మార్పులు, శరీరానికి ఉపశమనం కలగాలంటే తీసుకోవాల్సిన ఆహారాలేంటంటే..
ఆరోగ్యకరమైన ఆహారం ఎప్పుడూ శరీరానికి మేలు చేస్తుంది. వేసవికాలం నడుస్తున్నందున ఈ కాలంలో బయటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటి కారణంగా శరీరంలో కూడా ఉష్ణోగ్రతల మధ్య తేడాలు వస్తాయి. శరీరం వేడికి గురైతే శరీరంలో కలిగే మార్పులు, శరీరానికి ఉపశమనం కలగాలంటే తీసుకోవాల్సిన ఆహారాలేంటో తెలుసుకుంటే..
శరీరంలో వేడి పెరిగితే కనిపించే లక్షణాలు..
శరీరంలో నొప్పులు బాగా పెరుగుతాయి.
హార్ట్ బీట్ లో తేడా ఉంటుంది. శరీరంలో వాపు, నొప్పి కనిపిస్తాయి.
కడుపులో యాసిడ్లు, కడుపు ఉబ్బరం, జీర్ణసంబంధ సమస్యలు మొదలైనవి సాధారణం.
చిరాకు, ఉద్రేకం, దూకుడు, కోపం వంటి భావోద్వేగాలు విపరీతంగా ఉంటాయి. వేడి కారణంగా మానసిక స్థితి కూడా ప్రభావితం అవుతుంది.
ఇది కూడా చదవండి: మలబద్దకాన్ని ఈజీగా తగ్గించే విత్తనాలు ఇవే..!
శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు..
దోసకాయ గొప్ప రిఫ్రెషింగ్ డ్రింక్. దీన్ని తీసుకుంటే ఎంత వేడి శరీరం అయినా చల్లబడుతుంది.
పుచ్చకాయలు లేదా కస్తూరి పుచ్చకాయలలో బోలెడు పోషకాలు ఉంటాయి. విటమిన్-బి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
బచ్చలికూర, పాలకూర, ఉసిరికాయ, చైనీస్ క్యాబేజీ వంటివి శరీరానికి చలువ చేస్తాయి.
మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో బెస్ట్ గా పనిచేస్తుంది. ఇందులో వేయించిన జీలకర్ర, తాజా కొత్తిమీర, అల్లంతో తీసుకోవచ్చు.
మామిడి పండ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. మితంగా తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. పచ్చి మామిడితో ఆమ్ పన్నా చేసుకుని తాగితే వడదెబ్బకు కూడా చెక్ పెట్టవచ్చు.
నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసాన్ని జ్యూసులు, సలాడ్లలో వాడచ్చు.
పెరుగులో కాల్షియం, గట్ ఆరోగ్యానికి సహాయం చేసే బ్యాక్టీరియా ఉంటాయి. పెరుగులో పండ్లు కలిపి తీసుకుంటే ఎంతో రుచి.
అవకాడో లో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి వేడిని, టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో అధిక వేడి ఉత్పత్తి కాకుండా కాపాడతాయి.
కొబ్బరినీటిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్ గా, చల్లగా ఉంచుతాయి.
చేమంతిపూల టీ ని చమోమిలే టీ అని అంటారు. ఇది నిద్రలేమిని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
పుదీనాలో ఉండే గుణాలు చల్లదానాన్ని అందిస్తాయి. రిఫ్రెష్ పానీయాలలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ కలిగి ఉండే సహజ యాంటీ-అలెర్జిన్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.