మలబద్దకాన్ని ఈజీగా తగ్గించే విత్తనాలు ఇవే..!

మలబద్దకం ఈజీగా తగ్గడానికి కొన్ని విత్తనాలు అద్భుతంగా సహాయపడతాయి.

అవిసె గింజలు.. అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. జీవక్రియను ప్రోత్సహిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు శోథనిరోదక లక్షణాలను కలిగి ఉంటాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.

చియా సీడ్స్.. చియా సీడ్స్ లో ఫైబర్ బాగుంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ప్రేగు కదలికలు బాగుండేలా చేసి మలాన్ని మృదువుగా చేస్తుంది.

సైలియం విత్తనాలు.. సైలియం గింజలలో కరిగే ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది నీటిని గ్రహిస్తుంది. ప్రేగులలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

నువ్వులు.. నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే సహజమైన నూనెలు ప్రేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలు.. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో నూనెలు కూడా ప్రేగు కదలికలను  ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తాయి.