Share News

Chia Seeds Vs Flax Seeds: చియా విత్తనాలు లేదా అవిసె గింజలు.. రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యం?

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:04 PM

ఈ మధ్యకాలంలో చియా విత్తనాలు, అవిసె గింజలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ రెండింటిలోనూ పోషకాలు, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది? చాలామందికి తెలియని నిజాలివి.

Chia Seeds Vs Flax Seeds:  చియా విత్తనాలు లేదా అవిసె గింజలు..  రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యం?

ఆరోగ్యం మీద స్పృహ పెరిగే కొద్దీ తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ కారణంగానే ఆహారంలో విత్తనాలు, గింజలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఓట్స్, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు, ప్రోటీన్లు, విటమిన్లు.. ఇలా అన్నీ లెక్కగట్టుకుని మరీ తింటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చియా విత్తనాలు, అవిసె గింజలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ రెండింటిలోనూ పోషకాలు, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది? తెలుసుకుంటే..

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


చియా విత్తనాలు..

చియా విత్తనాలలో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి వివిధ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి .

ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఒమేగా-3 ఉండటం మూలాన గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

అవిసె గింజలు..

అవిసె గింజలు చియా గింజల కంటే కొంచెం పెద్దవి. రుచిని కలిగి ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన మొక్కల సమ్మేళనాలు, మాంగనీస్, విటమిన్ B1 (థియామిన్) వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


ఒమెగా-3 ..

చియా విత్తనాలు, అవిసె గింజలు రెండింటిలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ముఖ్యంగా అవిసె గింజలలో ఆల్పా-లినోలెనిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. అయితే చియా గింజలలో ఒమెగా-3 నుండి ఒమేగా-6 వరకు ఆమ్లాలు ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యానికి..

చియా గింజలు నీటిని గ్రహించి జెల్ లాంటి పదార్థంగా రూపాంతరం చెందుతాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తాయి. అవిసె గింజలలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. కానీ చియా విత్తనాల లాగా వీటితో జెల్ ఏర్పడదు.

ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!


ఏది ఎక్కువ ఆరోగ్యం ?

చియా గింజలు, అవిసె గింజలు రెండూ పోషకాలు సమృద్దిగా కలిగి ఉన్నా పోషక అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవాలి. చియా గింజలు వాటితో ఏర్పడే జెల్ కారణంగా సమతుల్య పోషకానికి విలువైనవిగా పరిగణింపబడతాయి. అవిసె గింజలు వాటిలో ఉండే ఆల్పా-లినోలెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ల కారణంగా విలువైనవిగా పరిగణింపబడతాయి. అవసరాన్ని బట్టి ఈ రెండింటినీ జోడించుకుంటే సరైన ప్రయోజనాలు పొందవచ్చు.

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 17 , 2024 | 03:04 PM