Share News

Black Coffee: బ్లాక్ కాఫీ ఎప్పుడైనా తాగారా? దీన్ని రోజూ ఒక కప్పు తాగితే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - May 13 , 2024 | 04:22 PM

చాలా మంది పాలతో చేసిన కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు. అయితే వీటికంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలేంటో.. ఇందులో ఉండే పోషకాలేంటంటే.

Black Coffee: బ్లాక్ కాఫీ ఎప్పుడైనా తాగారా? దీన్ని రోజూ ఒక కప్పు తాగితే ఏం జరుగుతుందంటే..!

కాఫీ, టీ అంటే భారతీయులకు ప్రాణం. పొద్దున్నే ఏదో ఒకటి కడుపులో పడితే తప్ప పనులు ముందుకు నడవవు. చాలా మంది పాలతో చేసిన కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు. అయితే వీటికంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలేంటో.. ఇందులో ఉండే పోషకాలేంటో తెలుసుకుంటే..

పోషకాలు..

ఆరోగ్య స్పృహ ఉన్నవారు తరచుగా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఇందులో పాలు, పంచదార వాడరు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో డోపమైన్, సెరోటోనిన్, నోరాడ్రినలిన్ పరిమాణాన్ని పెంచుతుంది. పైపెచ్చు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లతో పాటు, మంచి మొత్తంలో మాంగనీస్, క్లోరోజెనిక్ యాసిడ్, పాలీఫెనాల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి2, బి3, బి4 వంటివి ఇందులో ఉంటాయి.

55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!


ప్రయోజనాలు..

ఈ రోజుల్లో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. బ్లాక్ కాఫీ తీసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. వాస్తవానికి, కాఫీలో పుష్కలంగా కెఫిన్ లభిస్తుంది. దీని కారణంగా శరీరంలో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో పాటు అలసట, ఒత్తిడి, నీరసం దూరమవుతాయి.

రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. దీనివల్ల స్ట్రోక్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

బ్లాక్ కాఫీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. వ్యాయామం చేసే ముందు తప్పకుండా తాగితే మంచిది. ఇది శక్తిని అందిస్తుంది. ఎక్కువసేపు వ్యాయామం చేయగలుగుతారు.

ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!


ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధులతో పోరాడడంలో కాఫీ సహాయపడుతుంది. బ్లాక్ కాఫీని రోజూ తీసుకోవడం ద్వారా, అందులో ఉండే మూలకాలు హానికరమైన కాలేయ ఎంజైమ్‌ల స్థాయిని తగ్గిస్తాయి.

బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్యను నయం చేయవచ్చు. కాఫీ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది. దాని వల్ల మధుమేహం సమస్య తగ్గుతుంది.

గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!

ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 13 , 2024 | 04:22 PM