Share News

Tea: సాల్ట్ టీ గురించి విన్నారా? రోజూ టీలో చిటికెడు ఉప్పు వేసుకుంటే..

ABN , Publish Date - Feb 23 , 2024 | 06:33 PM

రోజూ సాల్ట్ టీ తాగితే బోలెడన్ని ఉపయోగాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Tea: సాల్ట్ టీ గురించి విన్నారా? రోజూ టీలో చిటికెడు ఉప్పు వేసుకుంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యధిక మంది తాగే పానీయం టీ. తమ రోజును టీ తాగడంతోనే మొదలెట్టేవారు కోకొల్లలు. టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించీ అందరికీ తెలిసిందే. టీలో కూడా బోలెడన్ని రకాలు ఉంటాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లేవర్ ఫేవరెట్. అయితే, టీలో ఉప్పు (Salt Tea) వేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు (Health benefits) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సాల్ట్ టీ గురించి చాలా తక్కువ మందికి తెలిసినప్పటికీ చైనాతో పాటు కశ్మీరీలు ఈ టీని అధికంగా తాగుతారు. దీన్ని తయారు చేయడం కూడా సులువే. ఎప్పటిలాగే టీ కాచుకున్నాక చివర్లో ఓ చిటికెడు ఉప్పు వేసుకుంటే సాల్ట్ టీ రెడీ అయిపోతుంది.

Insomnia: రోజుకు 3-4 గంటలకు మించి నిద్రపోకపోతే జరిగేదిదే..వైద్యుల హెచ్చరిక


సాల్ట్ టీ తో ఉపయోగాలు..

  • ఈ టీలో కొద్ది మొత్తంగా ఉండే ఉప్పుతో శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ మెరుగవుతుంది.

  • కణజాలంలోకి పోషకాలు మరింత సులభంగా చేరేలా చేస్తుంది సాల్ట్ టీ.

  • రక్తపోటు నియంత్రణకు, కడుపులో కావాల్సినంత జీర్ణరసం ఉత్పత్తికి తోడ్పడుతుంది.

  • రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. దీంతో, ఇన్ఫెక్షన్ల బెడద తప్పుతుంది. చలికాలం ముగుస్తున్న ఈ తరుణంలో రోజుకు కనీసం రెండు సార్లు ఈ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు.

  • టీలో హిమాలయన్ లేదా పింక్ సాల్ట్ వేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే జింక్‌తో కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై పులిపిర్లు రావు

  • మైగ్రేన్ సమస్యకు సాల్ట్ టీతో చెక్ పెట్టొచ్చు. శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది

  • టీలో ఉప్పుతో శరీరానికి కావాల్సినంత హైడ్రేషన్ కూడా చేకూరుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 06:41 PM