Share News

Beer Vs cholesterol: బీర్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:20 PM

ఇప్పటి భారతీయులకు మద్యపానం కూడా జీవనశైలిలో భాగం అయిపోయింది. ముఖ్యంగా యూత్ బీర్ పట్ల చాలా ఆసక్తిగా ఉంటారు. ప్రతి చిన్న సెలబ్రేషన్ లో బీర్ కు తప్పనిసరిగా స్థానం ఉంటోంది. బీర్ తాగితే బరువు తగ్గుతారనే వార్త ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. అయితే తాజాగా బీర్ కొలెస్ట్రాల్ మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

Beer Vs cholesterol: బీర్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

ఇప్పటి భారతీయులకు మద్యపానం కూడా జీవనశైలిలో భాగం అయిపోయింది. ముఖ్యంగా యూత్ బీర్ పట్ల చాలా ఆసక్తిగా ఉంటారు. ప్రతి చిన్న సెలబ్రేషన్ లో బీర్ కు తప్పనిసరిగా స్థానం ఉంటోంది. బీర్ తాగితే బరువు తగ్గుతారనే వార్త ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. అయితే తాజాగా బీర్ కొలెస్ట్రాల్ మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. బీర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందా? బీర్ తాగడం వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

బీర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధకులు చేసిన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బీర్ లో ప్రోటీన్, విటమిన్-బి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పరిమిత పరిమాణంలో బీర్ ను తీసుకుంటే అది శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సమర్థవంతంగా సహాయపడుతుందట.

ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!


ఒక బాటిల్ బీర్ లో 125 కేలరీలు ఉంటాయి. ఇది ఒక స్కిమ్ పాలకు సమానం అని ఆహార నిపుణులు అంటున్నారు. బీర్ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కు బదులుగా మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా ఇది సిరలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బీర్ లో ఫోలిక్ యాసిడ్ తో సహా బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా బీర్ ను పరిమిత మోతాదులో తీసుకుంటే గుండెపోటును నివారించడంలో సహాయపచతుందట.

పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!


డయాబెటిస్ ఉన్నవారు బీర్ తాగే విషయంలో ఆహార నిపుణులు, పరిశోధకులు కొన్ని విషయాలు వెలిబుచ్చారు. మధుమేహం ఉన్నవారు బీర్ ఎక్కువగా తాగితే అది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని తగ్గించవచ్చని అంటున్నారు.

బీర్ తీసుకుంటే జీవక్రియ మెరుగవుతుంది. బీర్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అయితే బీర్ ను ఎక్కువగా తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.

ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!

పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 26 , 2024 | 05:20 PM