Share News

Health: త్వరలో హోలీ.. ఫుల్‌గా ఎంజాయ్ చేసే ముందు ఒక్కసారి ఇలా చేయండి..

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:34 PM

పండగ సీజన్‌లో అతిగా తిని బరువు పెరుగుతామని భయపడేవాళ్లు తప్పక ఫాలో కావాల్సిన ఆరోగ్య సూత్రాలు

Health: త్వరలో హోలీ.. ఫుల్‌గా ఎంజాయ్ చేసే ముందు ఒక్కసారి ఇలా చేయండి..

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో రంగుల పండుగ హోలీ! ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు అనేక మంది ఇప్పటికే రెడీ అయిపోతుంటారు. పండగను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటారు. పండగ టైంలో (Festive Season) అనేక రకాల నోరూరించే వంటకాలు అందుబాటులో ఉండటంతో మొహమాటాలు పక్కనపెట్టి ఫుల్‌గా తినేసేవారు కోకొల్లలు. అయితే, కొందరికి పండగలంటే బెంగ. ఆ హడావుడిలో తెగ తినేసి బరువెక్కిపోతామని (Weight Gain) భయపడుతుంటారు. ఇలాంటి వారు ముందుగానే తమ డైట్‌లో తగు మార్పులు చేసుకుంటే (Deitary Changes) పండగ టైంలో బరువు మరీ పెరక్కుండా మేనేజ్ చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

Health: బిజీ లైఫ్ లో ప్యాకెజ్డ్ ఫుడ్ కు అలవాటు పడ్డారా.. వెంటనే మానుకోండి.. లేకుంటే మాత్రం..


ప్రొటీన్ ఫుడ్‌కు ప్రాధాన్యత..

ప్రొటీన్లు (Protein) అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు సులువుగా తగ్గొచ్చు. కడుపు చాలా సేపు నిండుగా ఉండటంతో పాటు కండ పట్టడానికీ ఈ తరహా ఫుడ్ ఉపయోగపడుతుంది. కోడి మాంసం, చేపలు, యోగర్ట్ వంటివి ట్రై చేస్తే ఆకలి అదుపులో ఉండటంతో పాటూ జీవక్రియలు మెరుగవుతాయి.

తృణధాన్యాలతో అద్భుతాలు

తృణధాన్యాలతో కూడిన ఆహారం బరువు నియంత్రణకు అనువైనదని చెబుతున్నారు. ఇవి తింటే శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం సమృద్ధిగా దొరుకుతుంది.

నీరు తాగడంపై నిర్లక్ష్యం వద్దు

బరువు నియంత్రణకు కావాల్సినంత నీరు (Hydration) తాగాలి. చాలా మంది దాహం వేస్తేనే నీరు తాగాలనుకుంటారు కానీ ఈ భావన తప్పని అనుభవజ్ఞులు చెబుతున్నారు. తగినంత నీరు తాగితే ఆకలిపై కూడా నియంత్రణ వస్తుంది. అంతేకాకుండా, నీరు అధికంగా ఉన్న దోస, వాటర్‌మెలన్, బత్తాయిలు వంటివి ఎక్కువగా తినాలి

చక్కెర వినియోగం తగ్గించాలి

హోలీ సందర్భంగా ఓ రేంజ్‌లో స్వీట్లు తినడం మామూలే. షుగర్ ఉండే (Refined Sugars) ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. కాబట్టి, చక్కెర బదులు తేనె వంటి సహజసిద్ధంగా లభించే వాటిని వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ మోతాదుల్లో ఆహారం తీసుకోవాలి

ఒకేసారీ కడుపు నిండా తినకుండా కొంచెం కొంచెంగా పలుమార్లు తింటే బరువు నియంత్రణ సులువవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Mar 21 , 2024 | 06:45 PM