Share News

Hyderabad: ECILలో 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్..అప్లై చేశారా?

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:44 PM

తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో పలు రకాల 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

Hyderabad: ECILలో 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్..అప్లై చేశారా?

తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో పలు రకాల 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం జనవరి 12, 2024 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 16, 2024గా ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ecil.co.inని సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ECILలో ఖాళీల వివరాలు

-ఎలక్ట్రానిక్స్/మెకానిక్ - 275 పోస్టులు

-ఎలక్ట్రీషియన్ - 275 పోస్టులు

-ఫిట్టర్ - 550 పోస్టులు


మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: న‌టుడు వీర భద్రయ్యకు ‘మనం సైతం’ కాదంబ‌రి కిర‌ణ్ సాయం

ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ ట్రేడ్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తయారీలో కనీసం ఒక సంవత్సరం అనుభవం (ITI + అప్రెంటిస్‌షిప్ తర్వాత) ఉండాలని పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 16, 2024 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. SC/ST అభ్యర్థులకు సడలింపు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అయితే అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ECIL రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 నెలల కాలవ్యవధికి నియమించబడతారు. ఈ ప్రాజెక్ట్, అవసరాలు, అభ్యర్థి పనితీరు ఆధారంగా దీనిని 2 నెలలు పొడిగించవచ్చు. ECIL రిక్రూట్‌మెంట్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ హైదరాబాద్‌లో జరగనుంది. ECIL రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,528 జీతం ఇవ్వబడుతుంది.

Updated Date - Jan 12 , 2024 | 05:45 PM