Share News

Medak: ఘనంగా ఏడుపాయల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించిన మైనంపల్లి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:28 PM

Telangana: తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వందేళ్ల చరిత్ర గల ఏడుపాయల వనదుర్గామాత దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర ప్రసిద్ధి చెందింది

Medak: ఘనంగా ఏడుపాయల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించిన మైనంపల్లి

మెదక్, మార్చి 8: తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వందేళ్ల చరిత్ర గల ఏడుపాయల వనదుర్గామాత దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర ప్రసిద్ధి చెందింది. నేటి నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అక్కడి మంజీరా నదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

Water Crisis: తీవ్ర నీటి సంక్షోభం.. ఈ పనులకు తాగు నీరు వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా


జాతరలో భాగంగా ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ దంపతులు, కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి పాలకమండలి సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ.. ఏడుపాయలను అభివృద్ధి చేస్తామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జాతర ఏర్పాట్లు చేశామని తెలిపారు. మూడు రోజుల పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి..

Medak: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 12:36 PM