Share News

Chanakya Niti: భార్య ఈ 5 పనులు చేస్తే భర్తతో సంబంధం చెడిపోవడం ఖాయం..!

ABN , Publish Date - May 22 , 2024 | 02:45 PM

Chanakya Niti: జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో.. పెళ్లయిన తొలినాళ్లలో అది అంత సున్నితంగా ఉంటుంది. వివాహ సమయంలో ప్రమాణం చేసేటప్పుడు వధు వరులు ఏడు ప్రమాణాలు చేస్తారు. సుఖం, దుఃఖంలో ఒకరినొకరు తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. కానీ నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం..

Chanakya Niti: భార్య ఈ 5 పనులు చేస్తే భర్తతో సంబంధం చెడిపోవడం ఖాయం..!
Chanakya Niti

Chanakya Niti: జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో.. పెళ్లయిన తొలినాళ్లలో అది అంత సున్నితంగా ఉంటుంది. వివాహ సమయంలో ప్రమాణం చేసేటప్పుడు వధు వరులు ఏడు ప్రమాణాలు చేస్తారు. సుఖం, దుఃఖంలో ఒకరినొకరు తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. కానీ నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. చిన్న, పెద్ద విషయాలు మీ భాగస్వామి మనస్సులో ఆగ్రహాన్ని సృష్టిస్తాయి, సంబంధంలో చీలికను సృష్టించే అవకాశం ఉంటుంది.


చాణక్య నీతి ప్రకారం.. మహిళలు ముఖ్యంగా సంభాషణల సమయంలో కొన్ని విషయాలు చెబుతారు. ఇది వారి సంబంధంలో చీలికను కలిగిస్తుంది. సంబంధాన్ని బలోపేతం చేయడానికి.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, భార్యలు తమ భర్తల ముందు పొరపాటున కూడా కొన్ని విషయాలు చెప్పకూడదు. అలాగే కొన్ని పనులు చేయకూడదు. భార్యలు తమ భర్తలతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. ఎందుకంటే వివాహాన్ని విడదీయరాని సంబంధం అంటారు. కానీ కొన్ని చిన్న విషయాల వల్ల ఈ సంబంధం శాశ్వతంగా నాశనం అవుతుంది.


పొరపాటున కూడా ఈ పని చేయొద్దు..

చాణక్య నీతి ప్రకారం.. వివాహానంతరం స్త్రీలు తమ భర్త లేదా అత్తమామల ముందు తల్లిదండ్రుల ఇంటిని పొగడకూడదు. వారి అత్త, మామల గురించి కోడలు చెడుగా మాట్లాడకూడదు. వారి భర్త ముందు ఇతర పురుషుల గురించి పొడగకూడదు. ఇది భర్తకు నచ్చదు. భర్తతో అత్తమామల గురించి పదే పదే ఫిర్యాదు చెయడం మంచిది కాదు. ఇది భర్తతో సంబంధంలో చీలికకు కారణం కావచ్చు.


అబద్ధాలు, కోపం..

చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అనవసరంగా అనుమానం పెరిగి బంధం చెడుతుంది. వైవాహిక జీవితంలో కోపం అనే పదాన్ని మరచిపోవాలి. కోపంలో వ్యక్తులు ఇష్టారీతిన మాట్లాడుతారు. ఆ తరువాత పశ్చాత్తాపపడతారు. కోపంగా ఉన్న వ్యక్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.


అహంకారం, అనవసరమైన ఖర్చు..

అహం కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువగా అంచనా వేస్తారు. ఇది సంబంధాల ముగింపునకు అతిపెద్ద కారణం అవుతుంది. భార్యాభర్తలు ఎప్పుడూ అహాన్ని పక్కనపెట్టి తప్పు చేస్తే ఆలస్యం చేయకుండా ఒకరినొకరు క్షమించాలి. భార్యాభర్తలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి. అనవసర ఖర్చుల వల్లనో, చెడు అలవాట్ల వల్లనో డబ్బు నీళ్లలా వృధా చేయకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది.


దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి..

భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను తమకే పరిమితం చేయాలని చాణక్య నీతి చెబుతోంది. తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. వైవాహిక జీవితంలో ఎవరైనా ఆనందాన్ని కోరుకుంటే.. ఎదుటి వ్యక్తి ఎంత సన్నిహితంగా ఉన్నా తమ భావాలను ఎవరికీ చెప్పకూడదు. వైవాహిక బంధంలో భార్యాభర్తలు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలను సరైన సమయంలో ఆపకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు శాశ్వతంగా చెడిపోతాయి.

For More Spiritual News and Telugu News..

Updated Date - May 22 , 2024 | 02:45 PM