Share News

Uttarpradesh: బాలికకు ఎంత కష్టం.. ప్రిన్సిపాల్‌తో ఉన్న వీడియో వైరల్ కావడంతో మనస్తాపం.. ఆత్మహత్యాయత్నం!

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:27 PM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ బాలికను స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేయడంతో ఆమె ప్రస్తుతం జిల్లా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ప్రిన్సిపాల్‌తో ఆ బాలిక అసహజ భంగిమలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Uttarpradesh: బాలికకు ఎంత కష్టం.. ప్రిన్సిపాల్‌తో ఉన్న వీడియో వైరల్ కావడంతో మనస్తాపం.. ఆత్మహత్యాయత్నం!
Minor girl

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ బాలికను (Minor girl) స్కూల్ ప్రిన్సిపాల్ (School Principal) అత్యాచారం చేయడంతో ఆమె ప్రస్తుతం జిల్లా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ప్రిన్సిపాల్‌తో ఆ బాలిక అసహజ భంగిమలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తన పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది (Crime News).


యూపీలోని కోఖ్‌రాజ్ ప్రాంతానికి చెందిన ఓ పాఠశాలలో ఓ 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ బాలికపై ఆ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరో వీడియో తీశారు. కాగా, అత్యాచార ఘటన బయటకు రావడంతో అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకుంది. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.


కాగా, ఆ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఆ వీషయం తెలుసుకున్న బాధిత బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. హాస్పిటల్‌‌కు సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకుంది. గూడ్సు రైలు కిందకు దూకేసింది. ఆ ఘటనలో ఆ బాలిక తీవ్ర గాయాలపాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

Viral: బాబోయ్.. ఇదెక్కడి వ్యాధి.. నిద్రలోనే షాపింగ్ చేసే డిజార్డర్.. యూకే మహిళ వింత జబ్బు వల్ల ఎంత నష్టమంటే..


Viral Video: బ్రెజిల్‌లోనే ఇలాంటివి సాధ్యం.. నడిరోడ్డుపై భారీ కొండ చిలువ ఎలా వెళ్తోందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం చదవండి..

Updated Date - Jun 09 , 2024 | 01:27 PM