Share News

SUV fell: 300 అడుగుల లోయలో పడిన ఎస్‌యూవీ..10 మంది మృతి

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:00 AM

జమ్మూ నుంచి శ్రీనగర్(Jammu Srinagar) వెళ్తున్న ప్యాసింజర్ SUV క్యాబ్(SUV skidded) రాంబన్ ప్రాంతంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఆ క్రమంలో టాక్సీ 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో అందులో 10 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి 44పై రాంబన్‌లోని చష్మా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటలకు ప్రమాదం జరిగింది.

SUV fell: 300 అడుగుల లోయలో పడిన ఎస్‌యూవీ..10 మంది మృతి

జమ్మూ నుంచి శ్రీనగర్(Jammu Srinagar) వెళ్తున్న ప్యాసింజర్ SUV క్యాబ్(SUV skidded) రాంబన్ ప్రాంతంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఆ క్రమంలో టాక్సీ 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో అందులో 10 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి 44పై రాంబన్‌లోని చష్మా(Battery Cheshma area) ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటలకు ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


ట్యాక్సీ శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్తున్న క్రమంలో భారీ వర్షం కారణంగా అదుపుతప్పి కాలువలో పడిపోయిందని అధికారులు(officers) చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 మంది ప్రయాణికుల మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. అయితే ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలు కష్టంగా ఉన్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సివిల్‌ క్యూఆర్‌టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నేను నిరంతరం వారితో టచ్‌లో ఉన్నానని పేర్కొన్నారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bus Fell: లోయలో పడిన ప్రయాణికుల బస్సు.. 45 మంది మృతి

Updated Date - Mar 29 , 2024 | 12:21 PM