Share News

Scammers: క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ.62 లక్షల కోట్లు దోచేశారు.. జర జాగ్రత్త!

ABN , Publish Date - Mar 01 , 2024 | 09:16 AM

రోజురోజుకు సోషల్ మీడియా మోసాలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు స్కామర్లు బాధితుల నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లకు పైగా(రూ.62,16,79,12,50,000) లూటీ చేసినట్లు ఓ సర్వే తెలిపింది.

Scammers: క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ.62 లక్షల కోట్లు దోచేశారు.. జర జాగ్రత్త!

రోజురోజుకు సోషల్ మీడియా మోసాలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ఆ క్రమంలోనే వాటి బారీన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది తప్ప, తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు స్కామర్లు(scammers) బాధితుల నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లకు పైగా(రూ.62,16,79,12,50,000) లూటీ చేసినట్లు ఓ సర్వే తెలిపింది. అంటే మన భారత కరెన్సీలో చూసుకుంటే దాదాపు 62 లక్షలకుపైగా కోట్లను దోచేశారని అర్థం. ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.

ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ ప్రొఫెసర్ జాన్ గ్రిఫిన్, గ్రాడ్యుయేట్ విద్యార్థి కెవిన్ ఈ మోసాలకు గురైన 4,000 మందికి పైగా బాధితుల నుంచి క్రిప్టో చిరునామాలను సేకరించారు. ఇది మహమ్మారి సమయం నుంచి ప్రజాదరణ పొందింది. ఆ క్రమంలో బ్లాక్‌చెయిన్ ట్రేసింగ్ టూల్స్‌(tools)తో వారు బాధితుల నుంచి నిధుల ప్రవాహాన్ని ట్రాక్ చేశారని, వారిలో ఎక్కువ మంది బాధితులు ఆగ్నేయాసియాలో ఉన్నారని వెల్లడించారు.


మొదట్లో చైనా(china)లో పాతుకుపోయిన ఈ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా(worldwide) విస్తరించాయి. విస్తృత నెట్‌ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో డేటింగ్ యాప్‌లు, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, తప్పుడు సందేశాలపై స్కామర్లు ఫోకస్ చేసినట్లు నివేదిక తెలిపింది. ఆ క్రమంలో స్కామర్‌లు తరచుగా స్నేహితులు లేదా శృంగార ఆసక్తులుగా నటిస్తూ నకిలీ పెట్టుబడి అవకాశాల గురించి చెప్పసాగారు. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో వారిని ఎలా మార్గనిర్దేశం చేస్తుందో బాధితులను నమ్మించి పెద్ద ఎత్తున దోచేశారు.

ఈ మోసపూరిత పథకాలు ఆసియా(asia)లో ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించే వరకు విశేషమైన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇది బిలియన్ల డాలర్ల నష్టానికి దారితీయడమే కాకుండా ఆన్‌లైన్ పరస్పర చర్యలు, ఆర్థిక లావాదేవీల భద్రత, సమగ్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Case File on Chinmayi: చిన్మయి వ్యాఖ్యలపై హెచ్ సీయూ స్టూడెంట్‌ పోలీసులకు ఫిర్యాదు!

Updated Date - Mar 01 , 2024 | 09:16 AM