Share News

Cyber Crime: 4 నెలల్లో రూ.7,061.51 కోట్లు లూటీ.. దేశంలో భారీగా పెరిగిన కేసులు

ABN , Publish Date - May 23 , 2024 | 06:51 PM

భారతదేశంలో సైబర్ నేరాల(cyber crime) సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే వరకు అంటే 2024 వరకు సగటున ప్రతిరోజూ 7 వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈవో రాజేష్ కుమార్ ఇటివల వెల్లడించారు. అంతేకాదు దేశంలో నాలుగు నెలల్లోనే కేటుగాళ్లు ప్రజల నుంచి భారీగా దోచుకున్నట్లు తెలిపారు.

Cyber Crime: 4 నెలల్లో రూ.7,061.51 కోట్లు లూటీ.. దేశంలో భారీగా పెరిగిన కేసులు
Indians lose Rs 7,061.51 crore from cybercrime

భారతదేశంలో సైబర్ నేరాల(cyber crime) సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే వరకు అంటే 2024 వరకు సగటున ప్రతిరోజూ 7 వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈవో రాజేష్ కుమార్ ఇటివల వెల్లడించారు. భారతదేశంలోని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరగాళ్లలో ఎక్కువ మంది దక్షిణాసియాలోని ప్రధాన ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రదేశాలలో కంబోడియా, థాయ్‌లాండ్‌లోని అనేక ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు మయన్మార్‌లోని మైవాడ్డీ, ష్వే కొక్కో వంటి నగరాలు కూడా ఉన్నాయన్నారు.


2021 నుంచి 2022 మధ్య కాలంలో దేశంలో సైబర్ నేరాల ఫిర్యాదులు(complaints) 113.7 శాతం పెరగాయని చెప్పారు. గత కొన్నేళ్లుగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 2019లో ఇటువంటి ఫిర్యాదుల సంఖ్య 26,049 ఉండగా, ఈ సంఖ్య 2020లో 2 లక్షల 55 వేల 777కు చేరుకుంది. 2021లో 4 లక్షల 52 వేల 414, 2022లో 9 లక్షల 56 వేల 790, 2023లో 15 లక్షల 56 వేల 215. 2024 ఏప్రిల్ నాటికి 7 లక్షల 40 వేల 957 ఫిర్యాదులు నమోదయ్యాయి. చాలా ఫిర్యాదులు నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లకు సంబంధించినవిగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు.


ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాలకు సంబంధించి మొత్తం 4,599 ఫిర్యాదులు అందాయి. వాటిలో స్కామర్లు(scammers) మొత్తం రూ.1203.06 కోట్లను దోచేశారు. ఇది కాకుండా ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 20,043 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రజలు 14,205.83 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. పెట్టుబడి మోసాలపై 62,687 ఫిర్యాదులు అందాయి. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.2225.82 కోట్ల మేర ప్రజలను మోసం చేశారు. ఇది కాకుండా 1725 డేటింగ్ స్కామ్‌ల ఫిర్యాదులు అందాయి, ఇందులో రూ.132.31 కోట్ల మోసం జరిగింది.


ఆ విధంగా దేశంలో(india) గత నాలుగు నెలల్లోనే సైబర్ క్రైమ్‌లలో పోగొట్టుకున్న మొత్తం రూ. 7,061.51 కోట్లు అని అధికారులు స్పష్టం చేశారు. దీంతోపాటు మోసానికి పాల్పడుతున్న వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. గత 4 నెలల్లో సుమారు 3.25 లక్షల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు చెప్పారు. ఇది కాకుండా 5.3 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేశామని, వాట్సాప్ గ్రూపులతో సహా 3401 సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలో వివిధ సంస్థల ద్వారా మొత్తం 10,000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. దీంతోపాటు సైబర్ డిఫెన్స్ మెకానిజం ప్రజలలో అవగాహనను కల్పించడం, అలాంటి వాటిని నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.


ఇది కూడా చదవండి:

Hyderabad: అమ్మకానికి చిన్నారి.. ఆర్‌ఎంపీ డాక్టర్‌ అరెస్ట్‌


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Read Latest Crime News and Telugu News

Updated Date - May 23 , 2024 | 06:55 PM