Share News

Hyderabad: ఫైనాన్సర్‌ వేధింపులకు వ్యక్తి బలి..

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:16 PM

ఫైనాన్స్‌ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం(Vijayanagaram) జిల్లా, రాగడి మండలం, లింగాలవలస గ్రామానికి చెందిన గోరజాన సంతోష్‌(34), భార్య రూపా బతుకుదెరువు కోసం 7సంవత్సరాల క్రితం నగరానికి వలసొచ్చారు.

Hyderabad: ఫైనాన్సర్‌ వేధింపులకు వ్యక్తి బలి..

హైదరాబాద్: ఫైనాన్స్‌ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం(Vijayanagaram) జిల్లా, రాగడి మండలం, లింగాలవలస గ్రామానికి చెందిన గోరజాన సంతోష్‌(34), భార్య రూపా బతుకుదెరువు కోసం 7సంవత్సరాల క్రితం నగరానికి వలసొచ్చారు. చింతల్‌ రంగానగర్‌(Chintal Ranganagar)లో నివాసముంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డబ్బులిస్తామని నమ్మించి పుస్తెలతాడు చోరీ


భార్య కూలిపని చేస్తుండగా, భర్త క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు డబ్బులు అవసరం ఉండడంతో గణేష్ నగర్‌లో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న చింటూ అనే వ్యక్తి వద్ద ఖలీల్‌, లవ్‌కుమార్‌(Khalil, Love Kumar)ల మధ్యవర్తిత్వంతో రూ. 60వేలు అప్పుగా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయారు.


city9.4.jpg

దీంతో ఫైనాన్స్‌ వ్యాపారి అప్పు తీసుకున్న సంతోష్ ను దుర్భాషలాడి మానసికంగా వేధించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్‌(Santosh) ఈనెల 3న సాయంత్రం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం భార్య రూపా జీడిమెట్ల పోలీసులకు తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Read Latest Telangana News and National News


Updated Date - Dec 06 , 2024 | 01:16 PM