Share News

Hyderabad: తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి..

ABN , Publish Date - Dec 10 , 2024 | 07:19 AM

తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి, ఫొటోలు సోషల్‌ మీడియా(Social media)లో పెట్టి ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాతబస్తీ ఛత్రినాక, వివేకనందనగర్‌(Old City Chatrinaka, Vivekananda Nagar)కు చెందిన జి. అజయ్‌కుమార్‌(30) ఛత్రినాకలో ఓ మద్యం దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

Hyderabad: తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి..

- ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌

- నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్: తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి, ఫొటోలు సోషల్‌ మీడియా(Social media)లో పెట్టి ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాతబస్తీ ఛత్రినాక, వివేకనందనగర్‌(Old City Chatrinaka, Vivekananda Nagar)కు చెందిన జి. అజయ్‌కుమార్‌(30) ఛత్రినాకలో ఓ మద్యం దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. పుట్టినరోజు(Birthday) వేడుకలో కేక్‌ కట్‌ చేయడానికి మూడు నెలల క్రితం రూ. 1,600తో తల్వార్‌ కొనుగోలు చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అరేయ్‌ అన్నందుకు.. న్యాయ కళాశాల జూనియర్‌, సీనియర్‌ల మధ్య ఘర్షణ


city2.2.jpg

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో తల్వార్‌(Talwar)తో కేక్‌ కట్‌ చేసి ఫొటోలను ఫేస్‌బుక్‌(Facebook)లో అప్‌లోడ్‌ చేశాడు. అవి వైరల్‌ కావడంతో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌, ఛత్రినాక పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అజయ్‌కుమార్‌(Ajay Kumar)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి తల్వార్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2024 | 07:20 AM