Hyderabad: చైన్‌స్నాచర్ అరెస్టు.. రిమాండ్
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:10 PM
బైక్‌పై వచ్చి మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంపుకుని పరారైన ముగ్గురిలో ఓ నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు(Malkajgiri Police) శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

- మరో ఇద్దరికోసం గాలింపు
హైదరాబాద్: బైక్‌పై వచ్చి మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంపుకుని పరారైన ముగ్గురిలో ఓ నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు(Malkajgiri Police) శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ శ్రీశైలం వివరాల ప్రకారం.. ఈనెల 6న మల్కాజిగిరి ప్రశాంత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఉదయం వాకింగ్‌చేస్తున్న ఓ మహిళ మెడలోని మంగళసూత్రం తెంపుకుని పరారయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విద్యుత్ కనెక్షన్ కట్ చేశారని ఉద్యోగిపై వినియోగదారుడి దాడి
సగం తెగిన మంగళసూత్రం మహిళవద్దే ఉండిపోగా మిగతా సగం నిందితుల పాలయ్యింది. మహిళ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిందితుల్లో ఒకరైన హర్యానాకు చెందిన సలీం (35) నగరంలోని మియాపూర్(Miyapur)లో లారీ డ్రైవర్. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సిబ్బంది అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్(Malkajgiri Police Station)కు తరలించారు.
విచారణలో ఈనెల 6న ముగ్గురం కలిసి మంగళసూత్రాన్ని చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే దొంగిలించిన సగం పుస్తెలతాడు మరో ఇద్దరు నిందితుల వద్ద ఉన్నట్లు తెలిపాడు. సలీం నుంచి పల్సర్‌బైక్‌తో పాటు ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న సలీం స్నేహితులు అనూ్‌పసుల్తాన్, షాహెద్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు సలీంను రిమాండ్‌కు తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News