Share News

Hyderabad: 19 ఏళ్లకే దారిదోపిడీలు.. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి..

ABN , Publish Date - May 23 , 2024 | 10:21 AM

రోడ్డుపై వెళ్తున్న ప్రజలను అడ్డగించి వారి సెల్‌ఫోన్‌లు(Cell phones) చోరీ చేసి ఉఢాయిస్తున్న దారిదోపిడీ ముఠా సభ్యులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: 19 ఏళ్లకే దారిదోపిడీలు.. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి..

- సెల్‌ఫోన్‌లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: రోడ్డుపై వెళ్తున్న ప్రజలను అడ్డగించి వారి సెల్‌ఫోన్‌లు(Cell phones) చోరీ చేసి ఉఢాయిస్తున్న దారిదోపిడీ ముఠా సభ్యులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 9మంది ఉండగా అందులో నలుగురు మైనర్లు, ఐదుగురు 19 ఏళ్ల వయస్సుగల వారు ఉన్నట్లు గుర్తించారు. మైనర్లను జువెనైల్‌ హోమ్‌(Juvenile Home)కు తరలించిన పోలీసులు మిగిలిన వారిని కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మూడు ఫోన్‌లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మి పెరుమాళ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్‌మెట్‌(Neredmet)కు చెందిన రోహన్‌రాజ్‌ అలియాస్‌ శివ, సికింద్రాబాద్‌కు చెందిన వివియన్‌ రాజ్‌లకు 19 ఏళ్లు. పనీపాట లేకుండా తిరుగుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కోడ్‌ ముగియగానే.. విద్యుత్‌శాఖలో బదిలీలు!


వారు మరో నలుగురు మైనర్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. మద్యం, సిగరెట్‌ వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారారు. డబ్బుల కోసం సెల్‌ఫోన్‌లు కొట్టేయాలని పథకం వేశారు. రెండు బైక్‌లపై గ్రూపులుగా వెళ్తూ.. రోడ్డున వెళ్లే సాధారణ ప్రజలను అడ్డగించి భయబ్రాంతులకు గురిచేసి వారి సెల్‌ఫోన్‌లు లాక్కొని ఉఢాయిస్తున్నారు. చోరీ సెల్‌ఫోన్‌లను సికింద్రాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన యుగెన్‌ అలెక్స్‌, నర్పత్‌ సింగ్‌, మల్కాజిగిరికి చెందిన సిలిగిరి రాజులకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలగిరి, మార్కెట్‌ పీఎస్‌, నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో వరుస కేసులు నమోదవుతుండటంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిఘా పెట్టిన పోలీసులు దొంగల ముఠాతో పాటు.. సెల్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని... మొత్తం 9 మందిని అరెస్టు చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 10:21 AM