Share News

Four labourers died: గనిలో విరిగిపడిన బండలు.. నలుగురు కార్మికులు మృతి

ABN , Publish Date - Feb 28 , 2024 | 08:10 AM

ఓ గనిలో అనేక మంది కూలీలు పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా రాతి బండ కూలిపోయి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా..మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో చోటుచేసుకుంది.

Four labourers died: గనిలో విరిగిపడిన బండలు.. నలుగురు కార్మికులు మృతి

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని దంతెవాడ జిల్లాలోని ఇనుప ఖనిజం గని(mine) ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాతి భాగం(rock caves) కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న నలుగురు కూలీలు మృత్యువాత చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన కిరండూల్(Kirandul) పోలీస్ స్టేషన్ పరిధిలో మైనింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆ ప్రాంతంలో ఇంకా మైనింగ్ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కానీ NMDC స్క్రీనింగ్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా 14 మంది కార్మికులు ప్రహరీ గోడలను నిర్మిస్తున్నారు. ఆ సమయంలో చాలా వరకు రాతిభాగం కూలిపోవడంతో కొంతమంది కార్మికులు దానిలో చిక్కుకుని మరణించారు. ఆ క్రమంలోనే విషయం తెలుసుకున్న పోలీసులు, NMDC యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.


మరికొంత మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కార్మికులను తరలించే సమయానికి వారు మరణించారని దంతెవాడ పోలీసు(police) సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు. మరోవైపు రాయి పడిపోవడం చూసిన మరికొంత మంది కూలీలు(labourers) పరుగులు తీశారని పేర్కొన్నారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bank Manager Cheated: NRI మహిళను రూ.13.5 కోట్లకు చీట్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఏమైందంటే

Updated Date - Feb 28 , 2024 | 08:10 AM