Share News

Fastag: KYC అప్‌డేట్ పేరుతో కొత్త స్కాం.. జర జాగ్రత్త!

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:18 PM

సైబర్ నేరగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫాస్టాగ్ KYC అప్‌డేట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పలువురు వినియోగదారులకు ఫాస్టాగ్‌ అప్‌డేట్ పేరుతో నకిలీ యాప్ లింక్ మేసేజ్ పంపుతున్నారు.

 Fastag: KYC అప్‌డేట్ పేరుతో కొత్త స్కాం.. జర జాగ్రత్త!

సైబర్ నేరగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫాస్టాగ్ KYC అప్‌డేట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పలువురు వినియోగదారులకు ఫాస్టాగ్‌ అప్‌డేట్ పేరుతో నకిలీ యాప్ లింక్ మేసేజ్ పంపుతున్నారు. ఆ తర్వాత వారి నుంచి ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు తెలుసుకుని డబ్బులు లాగేస్తున్నారు. ఇటివల కాలంలో ఇలా చాలా మంది యూజర్లను మోసం చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం ఏమారుపాటున ఉన్నా కూడా భారీ నష్టం పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి ఘటనే ఢిల్లీలోని గీతా కాలనీలో చోటుచేసుకుంది. ఓ వినియోగదారునికి ఫాస్టాగ్ డియాక్టివేట్ చేయబడిందని.. దానిని తిరిగి అప్‌డేట్ చేయాలని మేసేజ్ వచ్చింది. ఇందుకోసం అతను కంపెనీని కూడా సంప్రదించాడు. కానీ కస్టమర్ కేర్ నంబర్ Google నుంచి తీసుకున్నాడు.

అక్కడ అసలు నంబరుకు బదులు మోసగాళ్ల నంబర్‌కు ఫోన్ చేసి బాధితుడు బుక్కయ్యాడు. ఆ క్రమంలో ఫాస్టాగ్‌ని అప్‌డేట్ చేయడానికి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని వినియోగదారునికి మోసగాడు చెప్పాడు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, వినియోగదారు కొంత సమాచారాన్ని నమోదు చేయమని అడిగారు. అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు వివరాలు ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారు ఖాతా నుంచి రూ.10,000 మాయమైంది. దీంతో మోసాపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - Feb 15 , 2024 | 06:18 PM