Share News

DSP: ఈ డీఎస్పీ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలుసా.. లేడీ కానిస్టేబుల్‌తో రహస్య కాపురం

ABN , Publish Date - Apr 10 , 2024 | 08:53 AM

తిరుచ్చిలో ఓ అద్దె ఇంట్లో రహస్యంగా కాపురం చేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌, డీఎస్పీ(DSP)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగపట్టినం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీకి, తిరుచ్చి జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌(Female Constable)తో పరిచయం ఏర్పడింది.

DSP: ఈ డీఎస్పీ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలుసా.. లేడీ కానిస్టేబుల్‌తో రహస్య కాపురం

చెన్నై: తిరుచ్చిలో ఓ అద్దె ఇంట్లో రహస్యంగా కాపురం చేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌, డీఎస్పీ(DSP)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగపట్టినం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీకి, తిరుచ్చి జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌(Female Constable)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. విషయం తెలుసుకున్న మహిళా కానిస్టేబుల్‌ బంధువులు తిరుచ్చి సుబ్రమణ్యపురంలో వారు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఇద్దరు ఉన్నట్లు నిర్దారించుకున్న బంధువులు తలుపులకు తాళం వేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వెళ్లి లేడీ కానిస్టేబుల్‌ను వెలుపలికి పిలిచారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను సర్దిపుచ్చి వెలుపలికి రప్పించారు. ఆమె వెనుకే డీఎస్పీ కూడా వచ్చి పోలీసులును చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. తాను సెలవులో ఉన్నానని, తన వ్యక్తిగత వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకుంటారని మండిపడ్డారు. లేడీ కానిస్టేబుల్‌ బంధువులు ఫిర్యాదు చేయడం వల్లే విచారణ జరపడానికి వచ్చామని పోలీసులు బదులిచ్చారు. ఆ తర్వాత ఇద్దరినీ విచారించారు. పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

Updated Date - Apr 10 , 2024 | 08:53 AM