Share News

Bengaluru: ప్రాణాలు తీసిన ‘వీలింగ్‌’..

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:15 PM

వీలింగ్‌ చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం దేవనహళ్ళి తాలూకా విజయపుర(Vijayapura) పట్టణ బైపాస్ రోడ్డుపై ద్విచక్రవాహనంలో వీలింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

Bengaluru: ప్రాణాలు తీసిన ‘వీలింగ్‌’..

- బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

విజయపుర(బెంగళూరు): వీలింగ్‌ చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం దేవనహళ్ళి తాలూకా విజయపుర(Vijayapura) పట్టణ బైపాస్ రోడ్డుపై ద్విచక్రవాహనంలో వీలింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఉదయం ఓ మోస్తరు వర్షం కురుస్తున్నా యువకులు వీలింగ్‌ చేశారు. మృతిచెందిన వారిని పట్టణానికి చెందిన మనోజ్‌ (19), హర్బాజ్‌ (19)గా గుర్తించారు. పలువురు యువకులతో కలిసి వీలింగ్‌(Wheeling) చేస్తుండగా వేగంగా వస్తూ క్యాంటర్‌ను ఢీ కొనడంతో కిందపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌


pandu1.jpg

తలకు బలమైన గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని తప్పించేందుకు క్యాంటర్‌ డ్రైవర్‌ రోడ్డు పక్కకు మళ్లించాడు. అదృష్టవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టకుండా తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. కాగా బైపాస్ రోడ్డు(Bypass road)పై ఇటీవల యువకులు వీలింగ్‌ చేయడం అధికమైందని పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 12:15 PM