Share News

Kota Suicide: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 14 రోజుల్లో మూడో మరణం, అసలేం జరగుతోంది?

ABN , Publish Date - Feb 02 , 2024 | 09:16 PM

రాజస్థాన్‌లోని కోటాలో అసలు ఏం జరుగుతోంది. ఐఐటీ, జేఈఈ కోచింగ్‌ల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా విద్యార్థుల మరణాలకు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఈ క్రమంలోనే కోటాలో మరో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Kota Suicide: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 14 రోజుల్లో మూడో మరణం, అసలేం జరగుతోంది?

రాజస్థాన్‌లోని కోటాలో అసలు ఏం జరుగుతోంది. ఐఐటీ, జేఈఈ కోచింగ్‌ల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా విద్యార్థుల మరణాలకు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? గతంలో విద్యార్థులు ఫ్యాన్లకు ఊరేసుకోకుండా పలు హాస్టళ్లలో ఫ్యాన్లకు స్ప్రింగ్ విధానాలను కూడా అమర్చారు. ఈ క్రమంలోనే కోటాలో మరో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చర్చనీయాంశంగా..

27 ఏళ్ల విద్యార్థి నూర్ మహ్మద్ చెన్నైలోని ఓ కాలేజీలో ఆన్‌లైన్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతను కోటాలోని విజ్ఞాన్ నగర్‌లోని పెయిడ్ హాస్టల్ భవనంలో నివాసం ఉంటున్నాడు. ఆ విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి 2016 నుంచి కోటాలో ఉంటూ జేఈఈ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతను సూసైడ్ చేసుకోగా.. గత పది రోజుల్లో ఇది మూడో ఆత్మహత్య కేసు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Woman: ఇన్‌స్టాలో యువతి పరిచయం.. నమ్మించి ఫుడ్‌లో మత్తు మంది కలిపి ఇద్దరి అత్యాచారం


టిఫిన్ బాక్స్

నూర్ మహ్మద్ యూపీ వాసి అని పోలీసులు తెలిపారు. జేఈఈకి ప్రిపేర్ అయ్యేందుకు 2016లో కోటకు వచ్చాడు. అయితే 2019 తర్వాత ఏ కోచింగ్ సెంటర్‌లోనూ చదవలేదు. కోటాలో ఉంటూ ఆన్‌లైన్‌లో బీటెక్‌ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. బుధవారం రాత్రి టిఫిన్ ఇచ్చిన హాస్టల్లోని బాయ్ టిఫిన్ బాక్స్ తీసుకోవడానికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

విద్యార్థి గదిలో..

ఆ క్రమంలో నిన్న ఇచ్చిన టిఫిన్ అలాగే ఉందని బాయ్ గురువారం సాయంత్రం చూసాడు. ఆ తర్వాత అతను తలుపు కొట్టడం ప్రారంభించాడు. కానీ లోపల నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. అనంతరం అతను ఈ విషయాన్ని వారి యజమానికి తెలిపాడు. ఆ నేపథ్యంలో గది తలుపులు పగలగొట్టి చూడగా విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించగా... కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు.

27 మంది విద్యార్థులు ఆత్మహత్య

2023లో కోటాలో మొత్తం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కోటాలో 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరోవైపు కరోనా సమయంలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మూసివేయబడ్డాయి. ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించారు. 2020, 2021లో ఆత్మహత్యలు నివేదించబడలేదు.

ఒత్తిడి..?

అయితే చదువులు, మార్కుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెవడం వల్లే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనేక మంది విద్యార్థుల స్థాయికి మించి వారిపై ఒత్తిడి తేవడం వల్లే ఇలా జరుగుతుందని అంటున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 09:17 PM