Share News

Fire Accident: నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఊపిరాడక నలుగురు మృతి

ABN , Publish Date - Mar 14 , 2024 | 10:16 AM

ఓ నాలుగు అంతస్తుల భవనంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ఊపిరాడక మరణించారు.

Fire Accident: నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఊపిరాడక నలుగురు మృతి

ఢిల్లీ(delhi) శాస్త్రి నగర్(Shastri Nagar) ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ఊపిరాడక మరణించారు. శాస్త్రి నగర్‌ గీతా కాలనీ (వీధి నెం. 13)లోని ఓ భవనంలో తెల్లవారుజామున 5.22 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు(police), అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.


అయితే ప్రమాదం(accident) జరిగిన భవనంలో పార్కింగ్‌ స్థలం నుంచి మంటలు చేలరేగినట్లు అధికారులు(officers) ప్రాథమికంగా గుర్తించారు. ఆ క్రమంలో మంటలు క్రమంగా భవనం మొత్తం వ్యాపించినట్లు వెల్లడించారు. ప్రతి అంతస్తులో సోదాలు నిర్వహించి క్షతగాత్రులను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక ఫ్యామిలీ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Video: మద్యం మత్తులో కారుతో మార్కెట్‌లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

Updated Date - Mar 14 , 2024 | 10:16 AM