Share News

Fire Accident: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి

ABN , Publish Date - May 26 , 2024 | 07:59 AM

దేశ రాజధాని ఢిల్లీ శనివారం అర్ధరాత్రి రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 25మందిని కాపాడారు.

Fire Accident: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి
fire accident at delhi

దిల్లీ, మే 26: దేశ రాజధాని దిల్లీ శనివారం అర్ధరాత్రి రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 25మందిని కాపాడారు.


ఢిల్లీలోని ఓ పిల్లల ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు ఏరుగురు చిన్నారులు మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ సెంటర్‌లో రాత్రి 11.32గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఆస్పత్రి భవనం నుంచి 12మంది నవజాత శిశువులను రక్షించామని తెలిపారు. రాత్రి ప్రమాదం గురించి తమకు సమాచారం వచ్చిందని, 16 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది.


కాపాడిన 12మందిలో ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఓ చిన్నారి ఉండగా... ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనతో దేశ రాజధాని డిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం రాత్రి మరో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని 13మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారి తెలిపారు.


శనివారం తెల్లవారుజామున గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు సహా 27మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, వాటిని గుర్తించడం కష్టంగా ఉందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వినాయక్ పటేల్ తెలిపారు.


ఈ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

Fire Accident: గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

Updated Date - May 26 , 2024 | 08:43 AM