Share News

Girls Missing: 26 మంది బాలికలు మిస్సింగ్..బాలల హక్కుల కమిషన్ సీరియస్

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:16 PM

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు(girls) అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ బాలికల గృహం నడుస్తోంది.

Girls Missing: 26 మంది బాలికలు మిస్సింగ్..బాలల హక్కుల కమిషన్ సీరియస్

మధ్యప్రదేశ్(madhya pradesh) రాజధాని భోపాల్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు(girls) అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ బాలికల గృహం నడుస్తోంది. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఎన్జీవో హాస్టల్ (చిల్డ్రన్ హోమ్) నుంచి బాలికలు అదృశ్యమైన తర్వాత ఈ వివాదం మొదలైంది. వాస్తవానికి భోపాల్ శివార్లలోని పర్వాలియాలో నిర్వహిస్తున్న ఆంచల్ బాలికల హాస్టల్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో రిజిస్టర్‌ను పరిశీలించగా అందులో 68 మంది బాలికల ఎంట్రీలు ఉండగా అందులో 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు.


తప్పిపోయిన బాలికల గురించి అధికారులు చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా అతను సరైన సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత పోలీసులకు(police) సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికల హాస్టల్‌ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై జాతీయ బాలల కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వీర రాణాకు లేఖ కూడా రాశారు. అయితే ఆ బాలికలు గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: ఊడిన విమానం కిటికీ..తర్వాత ఏమైందంటే


ఈ విషయం గురించి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో సోషల్ మీడియా(social media) ద్వారా ట్వీట్ చేస్తూ ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మిషనరీ నిర్వహిస్తున్న అక్రమ బాలల గృహాన్ని రాష్ట్ర బాలల కమిషన్ ఛైర్మన్, సభ్యులతో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆ క్రమంలో చిన్నారుల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, లైసెన్స్ తీసుకోకుండా 1990 నుంచి బాలికల హాస్టల్‌ నిర్వహిస్తు్న్నారని చెప్పారు.

వారు ప్రధానంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని ఈ బాలికల గృహంలో 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల 40 మందికి పైగా బాలికలు ఉండగా..వారిలో ఎక్కువ మంది హిందువులేనని వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Jan 06 , 2024 | 03:18 PM