Share News

Laid Off: గత నెలలో ప్రమోషన్.. ఆ వెంటనే ఉద్యోగం నుంచి తొలగింపు..!!

ABN , Publish Date - May 07 , 2024 | 11:59 AM

ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తోంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను కర్కశంగా తొలగించింది.

Laid Off: గత నెలలో ప్రమోషన్.. ఆ వెంటనే ఉద్యోగం నుంచి తొలగింపు..!!
Laid Off

ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తోంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను కర్కశంగా తొలగించింది. తర్వాత కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. టెస్లా కంపెనీలో ఏడేళ్ల నుంచి సేవలు చేస్తోన్న ఓ ఉద్యోగిని తొలగించారు.


ఏప్రిల్ నెలలో టెక్నాలజీ విభాగంలో 21 వేల 473 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. 50 కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయని Layoff.fyi పేర్కొంది. తన సోదరిని టెస్లా కంపెనీ ఉద్యోగం నుంచి తీసవేసిందని జతిన్ సైన్ వివరించారు. ఇతను హౌస్ ఆప్ క్రియేటర్స్ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటారు.


‘తన సోదరికి వచ్చిన ఈ-మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టెస్లా కంపెనీలో ఏడేళ్ల నుంచి అంకిత భావంతో పనిచేసింది. శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు మెయిల్ వచ్చింది. గత నెలలో ప్రమోషన్ వచ్చింది. న్యూ జెర్సీ నుంచి వాషింగ్టన్ డీసీకి మకాం మారాలని అనుకుంది. ఈ నెల 3వ తేదీన ఆఫీసుకు రాగానే యాక్సిస్ కార్డు పనిచేయలేదు. ఉద్యోగం నుంచి తొలగించారు. అలా తాను ఒక్కరే కాదు.. చాలా మందిని తీసేశారు. ఏప్రిల్ 15వ తేదీన 16 వేల మంది ఉద్యోగులు. 15 రోజుల తర్వాత 500 మంది, రెండు రోజుల క్రితం సోదరికి మెయిల్ వచ్చింది. తన సిస్టర్ టీమ్‌లో 75 శాతం మందిని టెస్లా కంపెనీ విధుల నుంచి తప్పించింది అని’ జతిన్ సైన్ వివరించారు.



Read Latest Business News and Telugu News

Updated Date - May 07 , 2024 | 12:33 PM