Share News

UPI Payments: తప్పుడు యూపీఐ నెంబర్‌కు పేమెంట్ చేశారా? వెంటనే ఇలా చేయండి..

ABN , Publish Date - Feb 13 , 2024 | 09:53 PM

UPI Payments: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్‌ కాలం నడుస్తోంది. దీని కారణంగా మనీ ట్రాన్స్‌ఫర్ సెకన్లలో పూర్తవుతుంది. ఫోన్ తీసుడే.. డబ్బు కొట్టుడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే, ఈ స్పీడ్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పొరపాటుగా ఒకరికి పంపించాల్సిన డబ్బు.. తెలియని వారికి పంపడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

UPI Payments: తప్పుడు యూపీఐ నెంబర్‌కు పేమెంట్ చేశారా? వెంటనే ఇలా చేయండి..
UPI Payments

UPI Payments: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్‌ కాలం నడుస్తోంది. దీని కారణంగా మనీ ట్రాన్స్‌ఫర్ సెకన్లలో పూర్తవుతుంది. ఫోన్ తీసుడే.. డబ్బు కొట్టుడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే, ఈ స్పీడ్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పొరపాటుగా ఒకరికి పంపించాల్సిన డబ్బు.. తెలియని వారికి పంపడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పుడు బ్యాంక్ అకౌంట్‌కు గానీ, ఇతరుల యూపీఐ నెంబర్‌కు పేమెంట్స్ చేసి.. ఆ తరువాత అయ్యో అని వాపోతుంటారు. మరి ఇలా తప్పుడు నెంబర్‌కు పంపిన డబ్బు రిటర్న్ ఎలా వస్తుంది? ఇందుకోసం ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం..

డబ్బులు రీఫండ్ పొండం ఎలా?

తెలియని వ్యక్తులకు పొరపాటున డబ్బులు పంపినట్లయితే.. ముందుగా సదరు వ్యక్తి నెంబర్‌కు కాల్ చేసి జరిగిన పొరపాటును వివరించాలు. ఒకవేళ వారు రిఫండ్ చేయకపోతే వెంటనే బ్యాంక్‌కు ఫిర్యాదు చేయాలి. బ్యాంకు వారు ఈ డబ్బును తిరిగి రిఫండ్ చేస్తారు. అయితే, ఇది తప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్ అని ప్రూవ్ చేస్తూ.. డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, లావాదేవి వివరాలు, పంపిన బ్యాంక్ అకౌంట్/యూపీఐ నెంబర్‌తో పాటు సమస్యను బ్యాంక్‌ అధికారులకు తెలియజేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ లావాదేవీల అంబుడ్స్‌మన్ స్కీమ్ 2019 రెగ్యులేషన్ యాక్ట్ 8 ప్రకారం.. పొరపాటు ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బులను రిఫండ్ చేయడంలో బ్యాంక్ విఫలమైతే.. అంబుడ్స్‌మన్‌లో కంప్లైంట్ చేయాలి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) హెల్ప్..

తప్పుగా బదిలీ చేసిన డబ్బులను తిరిగి పొందడంలో NPCI సహాయాన్ని కూడా తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులకు పేమెంట్ చేసినట్లయితే.. వెంటనే NPCI అధికారులను సంప్రదించారు. కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించొచ్చు. NPCI వెబ్‌సైట్‌ని సందర్శించి.. కంప్లైంట్ సెక్షన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి.

NPCI కంప్లైంట్ గైడ్..

1. NPCI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. ‘కంప్లైంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. డ్రాప్-డౌన్ మెను నుండి లావాదేవీ స్వభావాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీరు అనుకోకుండా తెలియని వారికి డబ్బును బదిలీ చేసినట్లయితే.. ‘పర్సన్ టు పర్సన్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. అలాగే సమస్యను ‘తప్పుగా మరొక ఖాతాకు బదిలీ చేయడం జరిగింది’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. ఆ తరువాత అడిగిన వివరాలు సమర్పించాలి.

4. వివరాలు సబ్మిట్ చేశాక కాసేపట్లో మీకు రిప్లై వస్తుంది.

ఇలా బ్యాంక్, NPCI కి ఫిర్యాదు చేయడం ద్వారా పొరపాటుగా బదిలీ చేసిన డబ్బులను తిరిగి పొందవచ్చు. అవసరమైతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించి సమస్య పరిష్కారం పొందవచ్చు.

Updated Date - Feb 13 , 2024 | 09:53 PM