Share News

Uber: టాక్సీ డ్రైవర్లకు రూ.1475 కోట్లు చెల్లించేందుకు ఉబర్ అంగీకారం.. ఏమైందంటే

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:38 PM

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌(Uber)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇతర క్యాబ్ సేవల పేరుతో ఈ కంపెనీకి పోటీ వచ్చిన నేపథ్యంలో గతంలో అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు కూడా ఈ సంస్థకు ఆర్థిక భారంగా మారింది.

Uber: టాక్సీ డ్రైవర్లకు రూ.1475 కోట్లు చెల్లించేందుకు ఉబర్ అంగీకారం.. ఏమైందంటే

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌(Uber)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇతర క్యాబ్ సేవల పేరుతో ఈ కంపెనీకి పోటీ వచ్చిన నేపథ్యంలో గతంలో అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు కూడా ఈ సంస్థకు ఆర్థిక భారంగా మారింది. అయితే ఆస్ట్రేలియాలో ఉబర్ సేవలు మొదలైన తర్వాత తమ ఉపాధికి నష్టం వాటిల్లిందని 8,000 మంది టాక్సీ యజమానులు, డ్రైవర్లు(taxi drivers) కోర్టోలో కేసు వేశారు. ఉబర్ రాకతో తమ ఆదాయానికి గండి పడిందని చెప్పారు. ఆ క్రమంలో వారికి పరిహారం చెల్లించేందుకు మొదట ఉబర్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అనేక కోర్టు వాదనల తర్వాత ఎట్టకేలకు ఉబర్ రాజీకి అంగీకరించింది. అంతేకాదు ఈ కేసును పరిష్కరించేందుకు ఉబెర్ దాదాపు రూ.1,475 (USD 178 million) కోట్లు చెల్లించేందుకు ఒప్పుకుంది.


2019 నుంచి ఈ కేసు కొనసాగుతున్న క్రమంలో ఇటివల పూర్తైంది. ఈ ప్రతిపాదిత ఒప్పందంతో పాత కేసులను వదిలిపెట్టి ముందుకు సాగుతున్నట్లు ఉబెర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉబెర్‌కు వ్యతిరేకంగా ఈ కేసు 2019లో ఆస్ట్రేలియా(Australia)లోని విక్టోరియా రాష్ట్ర సుప్రీంకోర్టులో దాఖలు చేయబడింది. ప్రస్తుతం Uber ఈ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది. శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయ కేంద్రంగా ఉబర్ సంస్థ 2009లో ప్రారంభించబడింది. ఇది 70 దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ నగరాల్లో తన సేవలను నిర్వహిస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Solar Power: ఈ స్కీంతో లైఫ్ లాంగ్ నో పవర్ బిల్..పైగా సంపాదించుకునే ఛాన్స్

Updated Date - Mar 18 , 2024 | 12:38 PM