Share News

5 Stocks Pick: రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం చూడాల్సిన టాప్ 5 మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆ క్రమంలో సెన్సెక్స్ 1.30% పెరిగి 72,651.05 వద్ద ఉండగా.. నిఫ్టీ కూడా 1.2% పెరిగి 21,908 వద్ద ముగిసింది. ఈ క్రమంలో రేపు సోమవారం మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఎలాంటి స్టాక్స్‌పై ఫోకస్ చేయాలనే అంశాలను ఇప్పుడు చుద్దాం.

5 Stocks Pick: రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం చూడాల్సిన టాప్ 5 మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆ క్రమంలో సెన్సెక్స్ 1.30% పెరిగి 72,651.05 వద్ద ఉండగా.. నిఫ్టీ కూడా 1.2% పెరిగి 21,908 వద్ద ముగిసింది. ఈ క్రమంలో రేపు సోమవారం మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఎలాంటి స్టాక్స్‌పై ఫోకస్ చేయాలనే అంశాలను ఇప్పుడు చుద్దాం.

1. ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (CMP రూ.139.85)

Fedbank Financial Services Limited దాని Q3FY2024 ఫలితాలను జనవరి 15న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్‌ను వాచ్‌లిస్ట్‌లో ఉంచుకోవడం మంచిది. ఈ కంపెనీ ది ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కాగా.. బంగారం, గృహ, ఆస్తిపై లోన్ వంటి సేవలను అందిస్తుంది.

2. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (CMP రూ.209.90)

ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM) పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉంది. RP సంజీవ్ గోయెంకా గ్రూప్‌లో భాగమైన ఫస్ట్‌సోర్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, కమ్యూనికేషన్స్, మీడియా అండ్ టెక్నాలజీ సహా పలు సంస్థలకు కస్టమర్‌లకు సేవలు, పరిష్కారాలను అందిస్తుంది. ఈ స్టాక్ వారపు సగటును 21 రెట్లు అధిగమించింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి


3. DB రియాల్టీ లిమిటెడ్ (CMP రూ. 222.65)

DB రియాల్టీ లిమిటెడ్ యొక్క షేర్లు 10% ఎగువ సర్క్యూట్‌లో లాక్ చేయబడింది. బుల్లిష్ మొమెంటంను సూచిస్తుంది. ఈ సంస్థ ప్రధానంగా రియల్ ఎస్టేట్ నిర్మాణం, అభివృద్ధి, ఇతర సంబంధిత కార్యకలాపాల వ్యాపారంలో నిమగ్నమై ఉంది.

4. అషియానా హౌసింగ్ లిమిటెడ్ (CMP రూ.311.35)

అషియానా హౌసింగ్ ప్రధాన వ్యాపార కార్యకలాపం రియల్ ఎస్టేట్. ఇ కంపెనీ షేర్లు కొత్త 52 వారాల గరిష్ట స్థాయి ధర రూ.321కి చేరాయి. ఇది స్టాక్‌లో పెరిగిన కొనుగోళ్ల ఊపును సూచిస్తుంది.

5. వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ లిమిటెడ్ (CMP రూ.79.24)

వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ లిమిటెడ్ టూ స్టార్ ప్రోడక్ట్‌లు, జాయ్ ఇ-బైక్స్, వ్యోమ్ ఇన్నోవేషన్స్ ద్వారా ప్రస్తుత జీవన విధానాలకు స్వచ్ఛమైన, పచ్చటి ప్రత్యామ్నాయాలను అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ కంపెనీ తన Q3FY2024 ఫలితాలను రేపు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్‌ను పరిశీలించాలి.

గమనిక: ఈ అంచనాలను ప్రముఖ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థ ఏంజెల్ వన్ బ్రోకింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా లాభాలు లేదా నష్టాలు వచ్చినా కూడా తమకు ఎటువంటి సంబంధం లేదు.

Updated Date - Jan 14 , 2024 | 08:22 PM