Tesla Cars: ఇండియాలో టెస్లా కార్ల రేట్లు తగ్గించేందుకు ప్లానింగ్!
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:09 AM
ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన EV కార్ల ధరలను ఇండియాలో తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వేగంగా ఛార్జింగ్ చేసే చిన్న బ్యాటరీలను ఇక్కడి కార్లలో ఉపయోగించాలని చూస్తున్నారు.
ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల(tesla cars) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elon Musk) తన EV కార్ల ధరలను ఇండియాలో తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వేగంగా ఛార్జింగ్ చేసే చిన్న బ్యాటరీలను ఇక్కడి కార్లలో ఉపయోగించాలని చూస్తున్నారు. భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ రకమైన బ్యాటరీలు వినియోగించాలని భావిస్తున్నారు. అంతేకాదు ఇటువంటి బ్యాటరీలు ఇప్పటికే చైనాలో ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో కూడా టెస్లా అదే సాంకేతికతను తీసుకురావడాన్ని పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. చిన్న బ్యాటరీలను తయారు చేయడంలో కంపెనీ కేంద్రం సహకారాన్ని కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే చిన్న బ్యాటరీలతో వాహనాలను కొనుగోలు చేయడానికి టెస్లా కస్టమర్‌లను ఒప్పించడం చాలా కీలకమని చెప్పవచ్చు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Market Updates: వారంతంలో స్టాక్ మార్కెట్ల జోరు..250 పాయింట్ల ఎగువన సెన్సెక్స్
టెస్లా భారతీయ EV మార్కెట్లో $ 24,000 (సుమారు రూ.20 లక్షలు) విలువైన కారును తీసుకురావాలని యోచిస్తోందని. దీని కోసం చిన్న బ్యాటరీలను వినియోగించనున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం(central government) కూడా టెస్లా ప్రణాళికలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం టెస్లా చౌకైన మోడల్ ధర $48,950 (రూ.40 లక్షలు). 2020లో టెస్లా బ్యాటరీ డే సందర్భంగా మస్క్ మరింత సరసమైన మోడల్‌ను అందించడానికి $25,000 (రూ.20 లక్షలు) ఎలక్ట్రిక్ కారును రూపొందించినట్లు ప్రకటించారు.
మరోవైపు అలాంటి ప్లాన్ అమలు చేయడానికి భారతదేశ(India) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం పూర్తిగా సరిపోదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 9,300 ప్రభుత్వ రంగ ఛార్జర్ పాయింట్లు ఉన్నాయి. కానీ ఒక్క అమెరికాలోనే 1,38,000 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా భారతదేశంలో చాలా ప్రభుత్వ రంగ ఛార్జర్ యూనిట్లు అందుబాటులోకి వస్తే టెస్లా కార్లకు అనుకూలంగా మారనుంది. దీంతోపాటు ఈవీ కార్లు తీసుకునే అనేక మందికి ఉపయోగకరంగా మారనుంది.