Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Summer Offer: రూ. 400 లకే మినీ కూలర్.. వేసవిలో అదిరిపోయే ఆఫర్..

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:20 PM

Summer Mini Cooler: వేసవి వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కపోత ఎక్కువయ్యింది. దాంతో ప్రజలు ఎయిర్ కండీషనర్స్(AC), ఎయిర్ కూలర్స్(Air Coolers) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎయిర్ కూలర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసమే అదిరిపోయే న్యూస్ తీసుకొచ్చాం.

Summer Offer: రూ. 400 లకే మినీ కూలర్.. వేసవిలో అదిరిపోయే ఆఫర్..
Mini Coolers

Summer Mini Cooler: వేసవి వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కపోత ఎక్కువయ్యింది. దాంతో ప్రజలు ఎయిర్ కండీషనర్స్(AC), ఎయిర్ కూలర్స్(Air Coolers) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎయిర్ కూలర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసమే అదిరిపోయే న్యూస్ తీసుకొచ్చాం. అతి తక్కువ ధరకే కూలర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు.. డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. పైగా దీనిని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కు సునాయాసంగా తీసుకెళ్లవచ్చు.

మినీ కూలర్: వేసవి కాలంలో కూలర్లకు డిమాండ్ పెరుగుతుంది. మార్చి మొదటి వారంలోనే ఈసారి ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. ఎండ వేడితో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్‌లో మినీ కూలర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో పాటు.. మనకు అనుకూలంగా వీటిని తరలించొచ్చు కూడా. వీటి ధర రూ. 400 నుంచి మొదలవుతుండగా.. వీటికి విద్యుత్ కూడా తక్కువ ఖర్చవుతుంది. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న మినీ కూలర్స్ వివరాలు ఓసారి చూద్దాం..

చార్కీ మినీ కూలర్..

ఈ మినీ కూలర్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఉంది. దీని ధర రూ. 999, కానీ ప్రస్తుతం దీనిని రూ. 499కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ కూలర్‌ని ఆఫీసు లేదా షాప్ టేబుల్‌పై ఏర్పాటు చేసుకోవచ్చు. చల్లని గాలి కోసం కూలర్‌లో రిఫ్రిజిరేటర్ నీటిని కూడా ఉంచవచ్చు.

Suzec పోర్టబుల్ డ్యూయల్ బ్లేడ్‌లెస్ మినీ కూలర్..

ఇది డ్యూయల్ బ్లేడ్ కూలర్. దీనిలో రెండు దిశలలో గాలి వస్తుంది. అమెజాన్‌లో ఈ కూలర్‌ను రూ. 332 లకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ఎయిర్ కూలర్‌ను కారు డాష్‌బోర్డ్‌లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

CTRL మినీ కూలర్

ఈ కూలర్‌ను 83 శాతం తగ్గింపుతో కేవలం రూ.495కే కొనుగోలు చేయవచ్చు. ఈ కూలర్ లిస్టింగ్ ధర రూ. 2999. చల్లని గాలి కోసం CTRL కూలర్‌లో నీటిని కూడా నింపొచచు. ఇది రూమ్‌లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

SEMAPHORE ఎయిర్ కూలర్..

ఈ ఎయిర్ కూలర్ అమెజాన్‌లో రూ. 999కి లిస్ట్ చేశారు. దీనిని 60 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 399కి కొనుగోలు చేయవచ్చు. ఈ కూలర్‌లో డ్యూయల్ ఫ్యాన్ బ్లోవర్, చల్లని గాలి కోసం ఇందులో ఐస్ కూడా పెట్టడానికి సదుపాయం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2024 | 02:20 PM