Share News

NSO: 2023-24లో భారత్ GDP వృద్ధి 7.3%

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:09 PM

భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో 7.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) అంచనా వేసింది. ఇక 2022-23లో ఇది 7.2శాతంగా ఉంటుందని తెలిపింది.

NSO: 2023-24లో భారత్ GDP వృద్ధి 7.3%

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ(Bharat) ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.3% ఉండవచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 7.2%గా నమోదవుతుందని చెప్పింది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP రూ. 296.58 లక్షల కోట్లుగా అంచనా వేయగా..అది 2022-23లో రూ. 272.41 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రకటించింది.


మరోవైపు ఈ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం(agriculture sector) వృద్ధి 1.8% ఉండవచ్చని వెల్లడించింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4% కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. దీంతోపాటు 2023-24లో మైనింగ్ రంగం వృద్ధి 8.1% ఉండవచ్చని చెప్పగా..ఇది 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 4.6%గా నమోదైందని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం వృద్ధి 6.5% ఉండవచ్చని.. ఇది 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 1.3% చొప్పున ఉన్నట్లు గుర్తు చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Tirupati laddus: అయోధ్యకు ప్రత్యేకంగా లక్ష తిరుపతి లడ్డూలు


అంతకుముందు గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి(GDP) వృద్ధి అంచనాను 6.5% నుంచి 7%కి పెంచింది. ఇది కాకుండా గత రెండు త్రైమాసికాల్లో అంటే జూలై-సెప్టెంబర్, ఏప్రిల్-జూన్ త్రైమాసికాల్లో, భారత ఆర్థిక వ్యవస్థ వార్షికంగా 7.6%, 7.8% చొప్పున వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆదాయానికి సంబంధించి ఈ ముందస్తు అంచనా చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ డేటా ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సిద్ధం చేయనున్నారు. జూలై-సెప్టెంబర్‌లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 7.6%గా ఉంది. ఇది ఆర్థికవేత్తలు అంచనా వేసిన 6.8% కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. డేటా విడుదలైన కొన్ని రోజుల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023-24 వృద్ధి అంచనాను 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.0%కి పెంచింది.

Updated Date - Jan 05 , 2024 | 07:09 PM