Share News

IndiGo: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో..ఫస్ట్ ఏదంటే

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:26 PM

భారతదేశానికి చెందిన ఇండిగో(IndiGo) ఎయిర్‌లైన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ(market capitalisation) పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ $17.6 బిలియన్లకు (సుమారు ₹1.47 లక్షల కోట్లు) చేరుకోవడంతో ఈ రికార్డును సాధించింది.

IndiGo: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో..ఫస్ట్ ఏదంటే
IndiGo become third largest airline in the world

భారతదేశానికి చెందిన ఇండిగో(IndiGo) ఎయిర్‌లైన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ(market capitalisation) పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ $17.6 బిలియన్లకు (సుమారు ₹1.47 లక్షల కోట్లు) చేరుకోవడంతో ఈ రికార్డును సాధించింది. ఈ క్రమంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను వెనక్కి నెట్టి ఇండిగో ఈ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 10న ఈ సంస్థ షేర్లు 4.73% లాభంతో రూ.8,306 వద్ద ముగియడంతో ఈ ఘనతను సాధించింది.


డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం భారతదేశ విమానయాన రంగంలో ఇండిగో 60.2% వాటాను కలిగి ఉంది. ప్రయాణీకుల సంఖ్య పరంగా ఎయిర్ ఇండియా రెండవ స్థానంలో ఉంది, దాని వాటా 12.2%. ఇక టాటా గ్రూప్ కింద నడుస్తున్న ఎయిర్‌లైన్స్ మొత్తం వాటా 28.2%. అయితే గత ఏడాది మార్చిలో మార్కెట్ విలువ పరంగా గ్లోబల్ ఎయిర్‌లైన్స్ జాబితాలో ఇండిగో 14వ స్థానంలో ఉంది. ఇండిగో డిసెంబర్ 2023లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను అధిగమించింది.


ఈ ఏడాది జనవరిలో ఎయిర్ చైనాను, ఫిబ్రవరిలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌(airlines)ను దాటేసింది. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లు 102.55% పెరగడంతో ఈ రికార్డును అందుకుంది. అంతేకాదు ఇది గత 6 నెలల్లో 50.25%, ఒక నెలలో 18.25%, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి 27.78% పెరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ జాబితాలో US ఆధారిత డెల్టా ఎయిర్‌లైన్స్ మొదటి స్థానంలో ఉంది. దీని మార్కెట్ విలువ $30.4 బిలియన్లు (దాదాపు ₹2.53 లక్షల కోట్లు). ర్యాన్ ఎయిర్ హోల్డింగ్స్ 26.5 బిలియన్ డాలర్ల (₹ 2.16 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో రెండో స్థానంలో ఉంది.


ఇది కూడా చదవండి:

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..

EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే



మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 09:28 PM