Share News

Stock Market Updates: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. ఇవే టాప్ 5 లాస్ స్టాక్స్

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:22 AM

భారత స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్ మంగళవారం ఫ్లాట్ నోట్‌తో ప్రారంభమైంది. దీంతో మొదట అమ్మకాలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ మిశ్రమంగా కొనసాగుతుంది.

Stock Market Updates: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. ఇవే టాప్ 5 లాస్ స్టాక్స్

భారత స్టాక్ మార్కెట్‌(stock market) ట్రేడింగ్ మంగళవారం ఫ్లాట్ నోట్‌తో ప్రారంభమైంది. దీంతో మొదట అమ్మకాలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాయి. దీని కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ప్రారంభమైన తర్వాత రెడ్ మార్క్‌కు చేరుకున్నాయి. ఉదయం 9.16 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 152.66 పాయింట్లు (0.21%) పడిపోయి 72,555.49 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 46.50 పాయింట్లు (0.21%) పడిపోయి 22,075.75 స్థాయికి చేరుకుంది. కాగా గత రెండు రోజుల వరుస ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ వృద్ధి తర్వాత ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం లాభాల్లో ఉంది.


గ్లోబల్ సిగ్నల్స్ ప్రభావం కారణంగా మంగళవారం ప్రధాన మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్కెట్‌లో ఆటో, బ్యాంకింగ్ సహా ఐటీ రంగంలో విక్రయాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఈ(BSE) మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌లో ట్రేడవుతుండగా స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. సెక్టోరల్‌ సూచీల్లో ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.5-1 శాతం దిగువన ట్రేడయ్యాయి.

ఇక రియాల్టీ, టెలికాం, మీడియా సూచీలు 0.5-1 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, సిప్లా, BPCL, HCL టెక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా..పవర్ గ్రిడ్ కార్ప్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. నిన్న అంటే సోమవారం వరుసగా ఐదవ సెషన్‌లో స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగగా మూలధనం రూ. 2.20 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 391.69 లక్షల కోట్లకు చేరుకుంది.

Updated Date - Feb 20 , 2024 | 11:22 AM