Share News

Income Tax: పెద్దమొత్తంలో లావాదేవీలు చేస్తున్నారా.. ఐటీ ఓ కంట గమనిస్తోందని మీకు తెలుసా..

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:11 PM

పెద్ద మొత్తంలో ఆన్‌లైన్ లావాదేవీలు చేయకుండా.. అంతే మొత్తంలో నగదును ఖాతాలో జమచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆదాయపు

Income Tax: పెద్దమొత్తంలో లావాదేవీలు చేస్తున్నారా.. ఐటీ ఓ కంట గమనిస్తోందని మీకు తెలుసా..

పెద్ద మొత్తంలో ఆన్‌లైన్ లావాదేవీలు చేయకుండా.. అంతే మొత్తంలో నగదును ఖాతాలో జమచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆదాయపు పన్ను శాఖ గమనించదని కొందరు భావిస్తుంటారు. కానీ అవి తప్పు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జరిగిన ఏదైనా లావాదేవీపై అయినా ఐటీ శాఖ దృష్టి సారిస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో రోజురోజుకు ఆన్ లైన్ లావాదేవీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. లావాదేవీలు ఆన్‌లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా.. పరిమితికి మించిన మొత్తాన్ని కలిగి ఉంటే ఐటీ శాఖ కచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే నోటీసులు కూడా పంపిస్తుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే అది ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తుంది. బ్యాంకు ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల నగదు డిపాజిట్ల గురించి బ్యాంకు ఆరా తీస్తుంది. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల లావాదేవీల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. చాలా మంది షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, డిబెంచర్లు లేదా బాండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఇది మంచి పద్ధతి అని చెప్పవచ్చు. ఇటువంటి పెట్టుబడులు డబ్బును ఆదా చేసేందుకు ఉపయోగపడతాయి.


అయితే.. షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో నగదును ఉపయోగిస్తే.. వారిపై కూడా ఐటీ కొరడా ఝుళిపిస్తుంది. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం సర్వసాధారణ విషయంగా మారింది. నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.లక్ష దాటితే.. దానిని నగదు రూపంలో చెల్లించాలనుకుంటే ఐటీకి తప్పకుండా వివరణ ఇవ్వాలి. టైర్-1, టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి పెద్ద మొత్తంలో లావాదేవీలు చాలా కామన్. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేస్తుంటే మాత్రం ఐటీకి పన్ను కట్టాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 03:11 PM