Share News

Gold and Silver Prices: నేడు మరింత తగ్గిన గోల్డ్, వెండి రేట్లు..ఎలా ఉన్నాయంటే

ABN , Publish Date - Apr 19 , 2024 | 09:17 AM

దేశంలో గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి పుత్తడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 19న) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.10 తగ్గింది.

Gold and Silver Prices: నేడు మరింత తగ్గిన గోల్డ్, వెండి రేట్లు..ఎలా ఉన్నాయంటే
Gold and Silver Prices today

దేశంలో గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి పుత్తడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 19న) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.10 తగ్గింది. ఇది నిన్న రూ.67,650 ఉండగా, ఈరోజు రూ.67,640కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిన్నటితో పోల్చితే రూ.10 తగ్గింది. ఇది నిన్న రూ.73,800 ఉండగా, ఈరోజు రూ.73,790కి చేరుకుంది.


నగరం 24 క్యారెట్, 22 క్యారెట్

హైదరాబాద్ రూ.73,790 రూ.67,640

విజయవాడ రూ.73,790 రూ.67,640

ఢిల్లీ రూ.73,940 రూ.67,790

ముంబై రూ.73,790 రూ.67,640

చెన్నై రూ.74,550 రూ.68,340

కోల్‌కతా రూ.73,790 రూ.67,640

బెంగళూరు రూ.73,790 రూ.67,640

భువనేశ్వర్ రూ.73,790 రూ.67,640


ఇక వెండి(silver) ధరల విషయానికి వస్తే నేడు దీని ధర కిలోకు 100 రూపాయలు పడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో కిలో వెండి 89,900 రూపాయలుగా మారింది. ఇది నిన్న రూ.90,00గా ఉండేది. మరోవైపు ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కేజీ వెండి రూ.86,400 ఉండగా, ఇది నిన్న 86,500గా ఉంది. పన్నులు, ఎక్సైజ్ సుంకం సహా పలు కారణాలతో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 09:20 AM