Share News

India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ

ABN , Publish Date - Mar 04 , 2024 | 02:58 PM

భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.

India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ

భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ(global rating agency) మూడీస్(moodys) భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది. 2023 సంవత్సరంలో భారతదేశ ఆర్థిక గణాంకాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. దీని కారణంగా మూడీస్ వృద్ధి రేటు(growth rate) అంచనాలను పెంచింది. పటిష్టమైన వస్తు, సేవల పన్ను వసూళ్లు, పెరుగుతున్న వాహన విక్రయాలు, వినియోగదారుల విశ్వాసం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి డిమాండ్‌ బలంగానే ఉందని మూడీస్‌ పేర్కొంది.

2023 నాలుగో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన 8.4%గా ఉంది. ఈ క్రమంలో గత ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.7% చొప్పున వృద్ధి చెందింది. ప్రభుత్వ మూలధన వ్యయం, బలమైన తయారీ రంగం వృద్ధి దిశగా ఫలితాలను అందించాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం తెలిపింది. ఈ క్రమంలో ప్రపంచ స్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోయాయని తెలిపింది. ఈ కారణంగా భారత్(bharat) ఆరు నుంచి ఏడు శాతం వృద్ధిని సులభంగా నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ(rating agency) అభిప్రాయపడింది.


మూడీస్(moodys) తన గ్లోబల్ మాక్రో ఎకనామిక్ ఔట్‌లుక్-2024లో భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు కనబరిచిందని, 2023లో ఊహించిన దానికంటే బలమైన డేటా కారణంగా, తాము 2024కి వృద్ధి అంచనాలను పెంచినట్లు వెల్లడించింది. ఇక ప్రస్తుతం జీ20 దేశాలలో భారత్(india) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. మరోవైపు 2025లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Anant-Radhika PreWedding: అమ్మవారి రూపంలో నీతా అంబానీ డాన్స్ వీడియో

Updated Date - Mar 04 , 2024 | 02:58 PM