Share News

Stock Markets: మూడు రోజుల్లో రూ.7.8 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి

ABN , Publish Date - May 30 , 2024 | 04:27 PM

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదవ రోజైన గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మే 30న (గురువారం) బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.83 శాతం లేదా 617.60 మేర నష్టపోయి 73,885.60 పాయింట్ల ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ 216 పాయింట్లు లేదా 0.95 శాతం మేర క్షీణించి 22,500 మార్క్ దిగువన 22,489 వద్ద ముగిసింది.

Stock Markets: మూడు రోజుల్లో రూ.7.8 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
Sensex

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో (Stock Markets) నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదవ రోజైన గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మే 30న (గురువారం) బీఎస్‌ఈ సెన్సెక్స్ (Sensex) 0.83 శాతం లేదా 617.60 మేర నష్టపోయి 73,885.60 పాయింట్ల ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 (NSE Nifty) సూచీ 216 పాయింట్లు లేదా 0.95 శాతం మేర క్షీణించి 22,500 మార్క్ దిగువన 22,489 వద్ద ముగిసింది. టాటా స్టీల్, టెక్ మహింద్రా, టైటాన్ కంపెనీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1.5 శాతం నుంచి 5.75 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా చొప్పున నష్టపోయాయి. ఇక నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 3 శాతం, నిఫ్టీ ఐటీ 2.2 శాతం, నిఫ్టీ ఫార్మా 1.8 శాతం మేర క్షీణించాయి.


కాగా మూడు సెషన్లలో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో తమ సంపదను నష్టపోయారు. 3 సెషన్లలో కలిపి ఏకంగా రూ.7.8 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో సోమవారం ట్రేడింగ్ ముగింపు సమయానికి రూ.419.95 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ స్థూల మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం సాయంత్రానికి రూ.412.06 లక్షల కోట్లకు పడిపోయింది. ఒక్క గురువారమే రూ.415.09 లక్షల కోట్ల నుంచి రూ.3.03 లక్షల కోట్లు తగ్గి మేర తగ్గి రూ.412.06 లక్షల కోట్ల స్థాయికి పడిపోయింది.

ఇవి కూడా చదవండి

IRDAI: ఆరోగ్య బీమా విషయంలో కీలక నిర్ణయం

మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే

For more Business News and Telugu News

Updated Date - May 30 , 2024 | 04:39 PM