Share News

Credit Card: మారిన క్రెడిట్ కార్డ్స్ రూల్స్ తెలుసా.. ఎవరు అర్హులు, ఎప్పుడు అమలు?

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:24 PM

ఇకపై అనేక రకాల క్రిడెట్ కార్డుల(credit card)ను తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై అర్హత కల్గిన వినియోగదారులు బహుళ కార్డ్ నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని పొందనున్నారు. అయితే వీటికి ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Credit Card: మారిన క్రెడిట్ కార్డ్స్ రూల్స్ తెలుసా.. ఎవరు అర్హులు, ఎప్పుడు అమలు?

ఇకపై అనేక రకాల క్రిడెట్ కార్డుల(credit card)ను తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ సూచనల ప్రకారం క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు అర్హత గల కస్టమర్‌లకు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేటప్పుడు బహుళ కార్డ్ నెట్‌వర్క్‌లను ఎంచుకోవడానికి ఎంపికను అందిస్తారు. అయితే దీని ద్వారా కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు లభించనున్నాయి.

అయితే గతంలో డెబిట్ లేదా క్రిడిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకునే ఎంపిక లేదు. కానీ ఇటివల రూల్స్ ప్రకారం అర్హత గల వినియోగదారులు బహుళ నెట్‌వర్క్(multiple card networks) ఎంపికను పొందనున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుదారులకు, తదుపరి పునరుద్ధరణ సమయంలో కూడా ఈ ఎంపికను అందిస్తారు. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ ప్రకారం కార్డ్ నెట్‌వర్క్‌లు, జారీచేసేవారి మధ్య కొన్ని ఏర్పాట్లు కస్టమర్ల ఎంపికలను పరిమితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్డ్ జారీ చేసేవారు ఇతర కార్డ్ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించే కార్డ్ నెట్‌వర్క్‌లతో ఏర్పాటు లేదా ఒప్పందాన్ని కుదుర్చుకోకూడదు.


RBI ఆదేశం ప్రకారం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాస్టర్ కార్డ్ ఆసియా, M/s నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-రూపే, వీసా వరల్డ్‌వైడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లను అధీకృత కార్డ్ నెట్‌వర్క్‌లుగా గుర్తించింది. అయితే 10 లక్షల కంటే తక్కువ యాక్టివ్ కార్డ్‌లు ఉన్న క్రెడిట్ కార్డ్(credit card) జారీదారులకు ఈ సూచనలు వర్తించవు. జారీ చేసే సమయంలో కస్టమర్ ఎంపికకు సంబంధించిన సూచనలు జారీ చేసిన ఆరు నెలల్లోపు అమలులోకి వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. అంటే ఇది సెప్టెంబర్ 6, 2024 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Modi Presents: తొలిసారిగా 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

Updated Date - Mar 08 , 2024 | 01:25 PM