Share News

Budget 2024: ప్రతి ఒక్కరికీ శాశ్వత ఇళ్లు మంజూరు చేస్తాం

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:09 PM

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని నిర్మల తెలిపారు.

Budget 2024: ప్రతి ఒక్కరికీ శాశ్వత ఇళ్లు మంజూరు చేస్తాం

దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మా ప్రభుత్వం పారదర్శక పాలనపై దృష్టి సారించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని నిర్మల తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని గుర్తు చేశారు.


రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని నిర్మల వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను త్వరలోనే నిజం చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్‌, అందరికీ వంటగ్యాస్‌, అందరికీ బ్యాంకు ఖాతాల ద్వారా ప్రతి ఇల్లు, వ్యక్తి లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు సమయంలో చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Updated Date - Feb 01 , 2024 | 12:09 PM