Share News

Bharat Rice: రూ.29కే కిలో రైస్.. ఎప్పుడు? ఎక్కడ ఇస్తారు? వివరాలివే..

ABN , Publish Date - Feb 02 , 2024 | 06:28 PM

దేశంలో బియ్యం ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇకపై కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్రం తెలిపింది.

Bharat Rice: రూ.29కే కిలో రైస్.. ఎప్పుడు? ఎక్కడ ఇస్తారు? వివరాలివే..

దేశంలో బియ్యం ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇకపై కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. బియ్యాన్ని వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.29కి కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది.

ప్రతి శుక్రవారం బియ్యం నిల్వకు సంబంధించిన సమాచారం అందించాలని ఇప్పటికే వ్యాపారులకు సూచించారు. ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని అధికారులు వెల్లడించారు. భారత్ రైస్(bharat rice) ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా విక్రయించనున్నట్లు తెలిపారు. భారత్ రైస్ ప్రస్తుతం 5, 10 కిలోల ప్యాకెట్లలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Business Ideas: రూ.5 వేల పెట్టుపడి..ఇంటిదగ్గరే నెలకు రూ.60 వేలకుపైగా ఆదాయం!


వివిధ రకాల ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ గత ఏడాదిలో బియ్యం సహా రిటైల్ హోల్‌సేల్ ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. ధరలను నియంత్రించేందుకు, ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), అలాగే సెంట్రల్ స్టోర్ల ద్వారా రెండు సహకార సంఘాల ద్వారా రిటైల్ మార్కెట్‌లో సబ్సిడీతో కూడిన 'భారత్ రైస్'ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కిలో బియ్యాన్ని రూ.29కి విక్రయించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.

మొదటి దశలో ప్రభుత్వం రిటైల్ మార్కెట్‌లో విక్రయించేందుకు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించిందని చోప్రా అన్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే 'భారత్ అట్ట' కిలో రూ.27.50కి, 'భారత్ దాల్' (గ్రామ్) కిలో రూ.60కి విక్రయిస్తోంది. ప్రస్తుతం బియ్యం ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.

Updated Date - Feb 02 , 2024 | 07:09 PM