Share News

Credit Cards: ఒక్కరోజే రూ.500 కోట్లు కోల్పోయిన క్రెడిట్ కార్డ్ యూజర్లు.. ఈ మోసం తెలుసా?

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:32 AM

యాక్సిస్ బ్యాంక్‌(axis bank)కు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు(credit card users) విదేశాల్లో లావాదేవీల(overseas transactions) సమయంలో మోసానికి గురయ్యారు. ఆ క్రమంలో ఒక్కరోజులోనే దాదాపు రూ.500 కోట్లు కోల్పోయారు.

Credit Cards: ఒక్కరోజే రూ.500 కోట్లు కోల్పోయిన క్రెడిట్ కార్డ్ యూజర్లు.. ఈ మోసం తెలుసా?

యాక్సిస్ బ్యాంక్‌(axis bank)కు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు(credit card users) విదేశాల్లో లావాదేవీల(overseas transactions) సమయంలో మోసానికి గురయ్యారు. ఆ క్రమంలో ఒక్కరోజులోనే దాదాపు రూ.500 కోట్లు కోల్పోయారు. అయితే ఖాతాదారుల డేటాలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని బ్యాంక్ చెబుతోంది. మంగళవారం సాయంత్రం నుంచి ఖాతాదారుల నుంచి అక్రమ లావాదేవీల ఫిర్యాదులు అందుతున్నాయని యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హెడ్ సంజీవ్ మోఘే తెలిపారు. కస్టమర్‌లు కొన్ని ఇ కామర్స్ సైట్‌లలో తక్కువ (రూ.50) అనధికారిక కొనుగోళ్లపై హెచ్చరికలను అందుకున్నారని వెల్లడించారు.

మోసగాళ్లు కొన్ని కార్డ్ నంబర్‌(card numbers)లకు యాక్సెస్‌ను పొందారని తెలిపారు. అనధికార లావాదేవీలను నిర్వహించడానికి గడువు తేదీలతో సరిపోల్చారని, ఇవి అంతర్జాతీయ లావాదేవీలు అయినందున SMS, వన్ టైమ్ పాస్‌వర్డ్ వంటి ఏ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకుండానే జరిగిందని చెప్పారు. ఇలాంటి అనధికార లావాదేవీల గురించి సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంక్ అంతర్గత వ్యవస్థ కొన్ని లావాదేవీలను నిలిపివేసిందని మోఘే చెప్పారు. అయితే దీని వల్ల చాలా మంది కస్టమర్లు ప్రభావితమయ్యారని కూడా ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు ఒక్కరోజులోనే జరిగాయని, ఇప్పుడు అలాంటివేమీ జరగడం లేదని ఆయన వెల్లడించారు.


మోసం ఎలా జరిగింది?

అనధికార లావాదేవీల నిమిత్తం మోసగాళ్లు కొన్ని కార్డు నంబర్లను, దాని గడువు తేదీని పొందారని బ్యాంకు(bank) అధికారి అన్నారు. అవి అంతర్జాతీయ లావాదేవీలు కాబట్టి, వాటికి SMS లేదా వన్ టైమ్ పాస్‌వర్డ్ లేదా CVV నంబర్ వంటి ఏ ఇతర ప్రమాణీకరణ అవసరం లేదు. నేరస్థులు డేటాను ఎలా పొందారని అడిగినప్పుడు, వారు 16 అంకెల సంఖ్య మొదటి ఆరు అంకెలు బ్యాంక్ నిర్దిష్టమైనవి. పెట్రోల్ పంపులు లేదా రెస్టారెంట్లలో చెల్లింపు కోసం కార్డులు ఇచ్చినప్పుడు, అక్కడ నుంచి వారు కార్డు నంబర్ పొందే అవకాశం ఉందన్నారు.

ఇతర బ్యాంకులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయా అని అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని గురించి తనకు తెలియదని మోఘే చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ బాధిత ఖాతాదారుల క్రెడిట్ కార్డులను మారుస్తోందని, లావాదేవీలు జరిపిన మొత్తాన్ని వాపసు చేస్తుందన్నారు. ఇది బ్యాంకుకు 'షాక్' కాదు. ఈ ఘటనపై రిజర్వు బ్యాంకుకు(RBI) సమాచారం అందించామని మోఘే తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రూ.129 లక్షల కోట్లు 2023-24లో మార్కెట్‌ సంపద వృద్ధి ఇది..

Updated Date - Mar 29 , 2024 | 09:32 AM