Share News

Tata Group: టాటా vs పాకిస్తాన్ జీడీపీ.. సోషల్ మీడియాలో వైరల్

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:32 PM

మన దేశంలో ప్రముఖ సంస్థ టాటా కంపెనీ విలువ మన పొరుగు దేశమైన పాకిస్తాన్ జీడీపీ కంటె ఎక్కువగా ఉండటం విశేషం. అయితే ఈ కంపెనీ విలువ ప్రస్తుతం ఎంత ఉంది, ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

 Tata Group: టాటా vs పాకిస్తాన్ జీడీపీ.. సోషల్ మీడియాలో వైరల్

భారత్‌లో టాటా గ్రూప్(Tata Group) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఈ సంస్థ నుంచి అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. దీంతో ఈ కంపెనీ రోజురోజుకు మరింత వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఈ కంపెనీకి చెందిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఇప్పుడు పొరుగు దేశమైన పాకిస్తాన్(pakistan) జీడీపీ(GDP) కంటే ఎక్కువ కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ విలువ 365 కోట్ల డాలర్లు (రూ. 30.3 లక్షల కోట్లు)గా ఉంది. మరోవైపు IMF అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 361 కోట్ల డాలర్లు (రూ. 29.96 లక్షల కోట్లు)గా ఉంది.


అంతేకాదు టాటా గ్రూప్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ ఒక్కటే పాకిస్తాన్ GDPలో సగానికి పైగా ఉంది. రిలయన్స్ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కంపెనీగా TCS అవతరించింది. ఈ నెల ప్రారంభంలో టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.30 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ ఇదే. ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాటా గ్రూప్ 2023లో దాదాపు రూ.613,000 కోట్ల మార్కెట్ వాటాను పెంచుకుంది. ఇది తెలిసిన పలువురు సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక పాకిస్తాన్(pakistan) గురించి చెప్పాలంటే ఈ దేశం గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పులు పెరగడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గడంతోపాటు రాజకీయ అస్థిరత పరిస్థితిని మరింత దిగజార్చాయి. నివేదికల ప్రకారం 2011 నుంచి పాకిస్తాన్ విదేశీ రుణం దాదాపు రెండు రెట్లు పెరిగింది. మరోవైపు దేశీయ రుణం దాదాపు ఆరు రెట్లు పెరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది IMF పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి మూడు బిలియన్ డాలర్ల మొత్తాన్ని విడుదల చేసింది.

Updated Date - Feb 19 , 2024 | 04:32 PM