Share News

Adani Group: 8 శాతం పడిపోయిన అదానీ షేర్లు..కారణమిదేనా?

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:26 PM

ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్(adani group) షేర్లు పెద్ద ఎత్తున క్షీణించాయి. ఈ క్రమంలో అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ సహా గ్రూప్ ఇతర షేర్లు కూడా 2 నుంచి 4 శాతం క్షీణతతో ట్రేడయ్యాయి. అయితే దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.

Adani Group: 8 శాతం పడిపోయిన అదానీ షేర్లు..కారణమిదేనా?

ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్(adani group) షేర్లు ఈరోజు(మార్చి 18న) మళ్లీ పెద్ద ఎత్తున అమ్మకాల(sales) ఒత్తిడికి గురయ్యాయి. ఏకంగా దాదాపు నాలుగు శాతానికి పైగా పడిపోయాయి. ఆ తర్వాత మరికొన్ని షేర్లు కొలుకుని ఒక శాతానికి పరిమితమయ్యాయి. అయితే గౌతమ్ అదానీతో గ్రూప్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఇంధన ప్రాజెక్ట్‌లో సహాయం పొందేందుకు దేశంలోని అధికారులకు లంచం ఇచ్చినట్లు వచ్చిన ఆరోపించిన నేపథ్యంలో షేర్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ అంశంపై న్యూయార్క్‌(new york)లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన US అటార్నీ కార్యాలయం, వాషింగ్టన్‌లోని జస్టిస్ డిపార్ట్‌మెంట్ విభాగం దర్యాప్తు చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు అదానీ గ్రూప్ తన వివరణలో బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ తమ ఛైర్మన్‌పై ఎటువంటి విచారణ గురించి తమకు తెలియదని తెలిపింది. దీనికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.


మరోవైపు ఈ కంపెనీ షేర్లు(shares) నెలలో ఏకంగా దాదాపు 7.60 శాతం క్షీణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.5 లక్షల కోట్ల కంటే దిగువకు జారడంతో సోమవారం ఈ కంపెనీ షేర్లు పడిపోయాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అదానీ గ్రూప్(adani group) ఇప్పటికే ఏప్రిల్‌లో అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికను ప్రారంభించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అదానీ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Uber: టాక్సీ డ్రైవర్లకు రూ.1475 కోట్లు చెల్లించేందుకు ఉబర్ అంగీకారం.. ఏమైందంటే

Updated Date - Mar 18 , 2024 | 03:38 PM