Share News

YSRCP: కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన వైసీపీ మహిళా నేత..

ABN , Publish Date - May 30 , 2024 | 11:22 AM

వైసీపీ నేతల్లో ఆడ, మగ తేడా లేదు.. కబ్జాలకు కాదెవరూ అనర్హం అన్నట్టుగా తయారవుతున్నారు. ల్యాండ్ కనిపిస్తే లేపేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ మరీ ఇంతటి దారుణాన్ని చూడలేం. పెద్ద పెద్ద నేతలే కాదు.. చోటా మోటా నాయకులు సైతం కబ్జాలను దర్జాగా చేసేస్తున్నారు. మర్రిపాడులోని నెల్లూరు జాతీయ రహదారి వెంబడి కోట్ల విలువైన భూమిని వైసీపీ మహిళా నేత నర్సమ్మ కబ్జా చేసింది.

YSRCP: కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన వైసీపీ మహిళా నేత..

నెల్లూరు: వైసీపీ (YSRCP) నేతల్లో ఆడ, మగ తేడా లేదు.. కబ్జాలకు కాదెవరూ అనర్హం అన్నట్టుగా తయారవుతున్నారు. ల్యాండ్ కనిపిస్తే లేపేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ మరీ ఇంతటి దారుణాన్ని చూడలేం. పెద్ద పెద్ద నేతలే కాదు.. చోటా మోటా నాయకులు సైతం కబ్జాలను దర్జాగా చేసేస్తున్నారు. మర్రిపాడులోని నెల్లూరు జాతీయ రహదారి వెంబడి కోట్ల విలువైన భూమిని వైసీపీ మహిళా నేత నర్సమ్మ కబ్జా చేసింది. ఇటీవల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎకరా ప్రభుత్వ భూమిని నరసమ్మ కబ్జా చేయడం విశేషం.

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!


తాజాగా నెల్లూరు - ముంబై జాతీయ రహదారి వెంబడి సర్వే నంబర్ 469 లో ఇళ్ల స్థలాలకు కేటాయించిన ఎకరా భూమిని వైసీపీ మహిళా నేత నరసమ్మ కబ్జా చేసింది. దీనిపై స్థానికులు తహసీల్దార్, స్థానిక ఎస్ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తాను చెప్పేవరకు అటువైపు వెళ్ళొద్దంటూ స్థానిక వైసీపీ నేత తహసీల్దారుకు, ఎస్సైకి హుకుం జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ స్థానిక విపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు..

అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 11:22 AM