Share News

YS Sharmila: రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన సీఎం జగన్ దంపతులు.. పిలిచినా పట్టించుకోని షర్మిల..

ABN , Publish Date - Jan 18 , 2024 | 09:51 PM

YS Sharmila Son Engagement: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం వేదికగా వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు.

YS Sharmila: రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన సీఎం జగన్ దంపతులు.. పిలిచినా పట్టించుకోని షర్మిల..
YS Sharmila Son Engagement

హైదరాబాద్, జనవరి 18: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం వేదికగా వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరూ జగన్‌ను పట్టించుకోలేదు. ఫోటో దిగేందుకు రావాలని జగన్ పిలిచినా షర్మిల, అనిల్ రాలేదు. ఆ పక్కనే నిల్చున్నారు. దాంతో బొకే ఇచ్చి నిమిషంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్, భారతి.

కాగా, వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్ ఇవాళ(జనవరి 18, 2024)న జరిగింది. గురువారం సాయంత్రం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి కూడా హాజరయ్యారు. రాజారెడ్డి, ప్రియా జంటకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Jan 18 , 2024 | 09:57 PM