Share News

YS Sharmila: ఇవాళ పులివెందులలో షర్మిల ప్రచారం.. సర్వత్రా ఉత్కంఠ..

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:05 AM

కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇవాళ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె కడప జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. అయితే నేడు ముఖ్యంగా తన సొంత ఇలాఖా, తన సోదరుడు, ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులో షర్మిల పర్యటించనున్నారు.

YS Sharmila: ఇవాళ పులివెందులలో షర్మిల ప్రచారం.. సర్వత్రా ఉత్కంఠ..

కడప: కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (YS Sharmila) ఇవాళ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె కడప జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. అయితే నేడు ముఖ్యంగా తన సొంత ఇలాఖా, తన సోదరుడు, ఏపీ సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులో షర్మిల పర్యటించనున్నారు. వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, పులివెందుల మీదుగా ఎన్నికల ప్రచారం సాగనుంది. ఉదయం 10.30 గంటలకు వేంపల్లెలో బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు పులివెందుల పూల అంగళ్ళ వద్ద బహిరంగ సభను షర్మిల నిర్వహించనున్నారు.

Andhra Pradesh: జ‌గ‌న్.. ఈ పాపం ఎవ‌రిది..? వైసీపీ పాలనలో సామాన్యుడి కష్టాలు..


కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలా రెడ్డిని ఎంపిక చేసిన నాటి నుంచి అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది. షర్మిల ఎఫెక్ట్ అయితే కడప జిల్లాపై బాగానే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జగన్ అక్కడి వైసీపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారట. ఆయన స్థానంలో అభిషేక్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారట. అవినాష్ రెడ్డి ఉంటే.. ఒకవేళ ఓటమి పాలైతే పార్టీతో పాటు తనకు కూడా ఇబ్బందికరంగానే పరిస్థితి మారిపోతుందని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే అభ్యర్థిని మార్చాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చెల్లెల్లిద్దరూ షర్మిల, సునీతలు జగన్‌ను బాగానే గడగడలాడిస్తున్నారు.

Nara Bhuvaneshwari: సంక్షేమం పేరిట దోచేశాడు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 12 , 2024 | 10:05 AM