Share News

Sharmila: ఏ హామీని అమలు చేయనప్పుడు ఏపీ పార్టీలన్నీ బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయ్?

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:36 AM

ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Sharmila: ఏ హామీని అమలు చేయనప్పుడు ఏపీ పార్టీలన్నీ బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయ్?

ఢిల్లీ: ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విపక్ష నేతలను కలిసిన షర్మిల ఇవాళ ఏకంగా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ గడ్డ మీద ఈ రోజు షర్మిల సమరశంఖం పూరించారు.

పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదని షర్మిల పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని మోదీ చెప్పినా కూడా ఇప్పటికీ ప్రత్యేకహోదాని ఇవ్వలేదని.. హామీలను అమలు చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్ ప్లాంట్ వంటి హామీలు అమలుకు నోచుకోలేదని షర్మిల అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.

హామీలు అమలు చేయనప్పుడు బీజేపీకి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతునిస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. పదేళ్లవుతున్నా కూడా కీలకమైన పది హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. తమ పోరాటం ఇకముందు కూడా కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలను దీనిపై కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తామని వెల్లడించారు. చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.

ఏపీ హక్కుల కోసం చేసే పోరాటానికి మద్దతిస్తాం: తిరుచ్చి శివ

కాగా.. షర్మిల తమ పోరాటానికి డీఎంకేను సైతం మద్దతు కోరారు. దీనిపై స్పందించిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ.. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్నారని.. స్టాలిన్ రాగానే చర్చించి మద్దతు ఇస్తామన్నారు. అన్ని రాష్ట్రాలనూ కేంద్రం సమానంగా చూడాలన్నారు. సవతి తల్లి ప్రేమ చూపించడం సరికాదన్నారు. రాజ్యసభలో ఏపీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తిరుచ్చి శివ తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 11:37 AM